Kesineni Swetha: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృత్తం చేస్తున్నారు.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39 డివిజన్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేతా.. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు.. విద్యకు పెద్దపీట వేసి నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య అందజేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఎంపీ కేశినేని నాని రెండు దఫాలుగా లోక్ సభకు ప్రాతినిధ్య వహించి.. నియోజకవర్గంలో అనేక సమస్యలు పరిష్కరించారని గుర్తుచేశారు.
Read Also: Uttarpradesh : భర్తతో గొడవ.. పిల్లలతో సహా నదిలో దూకి తల్లి సామూహిక ఆత్మహత్య
ఎంపీగా కేశినేని నాని.. దుర్గగుడి ఫ్లైఓవర్, నందిగామ బైపాస్ నిర్మాణం వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించారని తెలిపారు కేశినేని శ్వేతా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో చేసిన అభివృద్ధికి కళ్లకు కట్టినట్టు కనబడుతుందన్నారు. ఇక, స్థానికంగా ఓటు లేని వ్యక్తులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.. చైతన్యవంతులైన పశ్చిమ నియోజకవర్గం ప్రజలు స్థానికేతరులైన నాయకులను నమ్మరని తెలిపారు. నిరంతరం ప్రజల్లో ఉండే ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ లకు ఓట్లు వేయాలని.. భారీ మెజార్టీతో పార్లమెంట్, అసెంబ్లీకి పంపించాలని ప్రజలను కోరుతూ ప్రచారం నిర్వహించారు కేశినేని శ్వేతా.