NTV Telugu Site icon

Kesineni Nani Quits Politics: కేశినేని నాని సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్‌బై..

Kesineni Nani

Kesineni Nani

Kesineni Nani Quits Politics: బెజవాడ రాజకీయలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇక, ప్రత్యక్ష రాజకీయాలనుంచి వైదొలుగుతున్నాను అంటూ ప్రకటించారు.. తనను రెండు సార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నాని.. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు బెజవాడ మాజీ ఎంపీ.. కాగా, 2014, 2019 ఎన్నిలకలో టీడీపీ నుంచి బరిలోకి దిగి బెజవాడ ఎంపీగా గెలిచిన నాని.. మొన్నటి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.. ఇక, ఈ సార్వత్రిక ఎన్నికల్లో తన తమ్ముడు కేశినేని చిన్నిపై నాని ఓడిపోయిన విషయం విదితమే.. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

Read Also: Charle Son Wedding: నటుడు చార్లీ పెళ్లి.. రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి

ఇక, ట్విట్టర్‌ (ఎక్స్‌)లో ఆయన పోస్టును పరిశీలిస్తే.. “జాగ్రత్తగా ఆలోచించి, ఆలోచించిన తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను మరియు నా రాజకీయ ప్రయాణాన్ని ముగించాను.. రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవం. విజయవాడ ప్రజల స్థైర్యం మరియు దృఢసంకల్పం నాకు స్ఫూర్తినిచ్చాయి, వారి తిరుగులేని మద్దతుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను రాజకీయాలకు దూరమవుతున్నా, విజయవాడ పట్ల నా నిబద్ధత బలంగానే ఉంది. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటాను. నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కొత్త అధ్యాయానికి వెళుతున్నప్పుడు, నేను ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలను మరియు అమూల్యమైన అనుభవాలను నాతో తీసుకువెళుతున్నాను. విజయవాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు. విజయవాడ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేసే అపురూపమైన అవకాశాన్ని కల్పించినందుకు మరోసారి వారికి కృతజ్ఞతలు. హృదయపూర్వక కృతజ్ఞతతో.. మీ కేశినేనా నాని” అంటూ ట్వీట్‌ చేశారు బెజవాడ మాజీ ఎంపీ కేశినేని నాని..