Site icon NTV Telugu

Kesineni Nani: అటు పవన్ను.. ఇటు బీజేపీని చంద్రబాబు మోసం చేస్తున్నాడు..

Kesineni

Kesineni

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఇంప్రెస్ చేయడానికి ఆయన నానా పాట్లు పడ్డారు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడికి ఒక్క ముక్క హిందీ రాదు.. తెలుగులో రాసుకొని హిందీలొ చదివాడు అని చెప్పారు. ఒకప్పుడు మోడీని టెర్రరిస్ట్ అన్నాడు.. ఇప్పుడు గొప్పవాడు మంచివాడు అంటున్నాడు అని ఆయన ఆరోపించారు. ప్రపంచ దేశాలు మోడీని అసహ్యించుకుంటున్నాయని అనాడు అన్నాడు.. ఇప్పుడు మోడీ ప్రపంచానికి ఆదర్శం అంటున్నాడు.. చంద్రబాబు ఊసరవెల్లి లాగా రంగులు మార్చి నిన్నొక్కటి ఇవాళ ఒకటి మాట్లాడుతున్నాడు అని ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పిస్తున్నారు.

Read Also: Ilayaraaja: ‘ఇళయరాజా’ బయోపిక్ లో హీరో ధనుష్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది..

ఆనాడు చంద్రబాబు పర్సనల్ అజెండాతో ప్రధాన మంత్రి అయిపోదామని.. ఇక్కడా కొడుకునీ ముఖ్యమంత్రి చేద్దామని ఆ పథకం బేడిసి కొట్టడంతో అధికారం కోల్పోయి కుప్పకూలిపోయాడు.. చంద్రబాబు చేసిన స్కామ్ నుంచి బయటపడడానికి మోడీ, అమిత్ షా కాళ్లు పట్టుకొని పొత్తు కుదుర్చుకొని వచ్చాడు అని ఆయన పేర్కొన్నారు. అటు పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు మోసం చేస్తున్నాడు.. ఇటు బీజేపీని మోసం చేస్తున్నాడు.. పచ్చి మోసగాడు చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడి వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు, ప్రజలకి ఉపయోగం లేదు అని ఎంపీ కేశినేని విమర్శలు చేశారు.

Exit mobile version