Site icon NTV Telugu

Kesineni Nani: చంద్రబాబు వీక్నెస్‌ బయటపెట్టిన కేశినేని నాని..

Nani

Nani

Kesineni Nani: టీడీపీకి గుడ్‌బై చెప్పిన బెజవాడ ఎంపీ కేశినేని నాని.. సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.. ఇక, అప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌.. మరికొంతమంది లీడర్లను టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఒకరు ఎదిగితే ఓర్వలేని మనిషి చంద్రబాబు అంటూ మండిపడ్డారు.. కొన్ని పాములు తన పిల్లలు తానే, తన గుడ్లను తానే మింగిసినట్లు.. చంద్రబాబు కూడా పార్టీలో ఎదిగేవారిని చూసి.. ఉండలేరని ఆరోపణలు గుప్పించారు.. నేను ఎదగడం కూడా చంద్రబాబుకు ఇష్టం లేదని.. నన్ను ఎంపీగా నిలబెడుతూనే.. పోటీగా ఐదు మందిని పెట్టారంటూ దుయ్యబట్టారు..

Read Also: Chandrababu Bail Cancellation Petition: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌.. విచారణ వచ్చే నెలకు వాయిదా

ఇక, కేశినేని ట్రావెల్స్‌ మూతపడడానికి ఆ ఇద్దరే కారణమంటూ సంచలన వ్యాఖ్యలుచేసిన కేశినేని నాని.. ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబుకి బొకే తోసేయడం వెనుక ఉన్న స్టోరీని కూడా చెప్పుకొచ్చారు.. ఈ మధ్య ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన గీతాంజలి మరణం వెనుక నారా లోకేష్‌ అండ్‌ సోషల్‌ మీడియా టీమ్‌ ఉందంటూ ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌ కలిసే తనను జగన్‌ చేతుల్లో పెట్టారంటూ దుయ్యబట్టారు.. బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న విజయవాడను కబ్బా చేసి అమ్మేస్తారంటూ వ్యాఖ్యానించిన ఆయన.. అవసరం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఉందా? అంటే ఏం సమాధానం చెప్పారు.. కాల్‌ మనీ, సెక్స్‌ రాకెట్‌ విషయంలో .. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన సంచలన వ్యాఖ్యలను తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Exit mobile version