NTV Telugu Site icon

Kesineni Chinni:ఏపీకి 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా కూటమి కృషి

Kenineni Chinni

Kenineni Chinni

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గత ప్రభుత్వ హయాంలో పొలిటికల్ ఉద్యోగాలు అందించేలా సలహాదారు నియామకాలు జరిగేవి. కానీ, కూటమి ప్రభుత్వం పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికీ మాత్రమే సలహాదారుగా నియమించారు. ఏపీకి 7 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేలా కూటమి కృషి చేస్తోంది. త్వరలో విశాఖ, విజయవాడలో మెట్రో రాబోతోంది. 11 పట్టణాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు కేంద్రం సహకారంతో తెస్తున్నామని వెల్లడించారు.

Also Read:Naga Vamsi : పవన్‌తో మూవీ చేయాలనుకోవడం తప్పు..

ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుంది. మనకు రావాల్సిన నిధులు తెచ్చేందుకు మన ఎంపీలు కృషి చేస్తున్నారు. నా సొంత నిధులతో nirdలో శిక్షణ ఇప్పించి వికసిత్ పంచాయతీ పేరుతో 24 గ్రామాలను దత్తత తీసుకున్నాం. మా కేశినేని ఫౌండేషన్ ద్వారా అక్కడ గ్రామ సభ ఎలా ఉండాలి, సమస్యలు పరిష్కారం అయ్యేలా టీంలను ఏర్పాటు చేశాం. ఖాళీగా ఉన్న యువతకు ఉపాధి కల్పించేలా పది వేలు స్టై ఫండ్ ఇస్తున్నాం. 295 గ్రామాల్లో యువత ను నియమించి వికసిత్ భారత్ కింద సమస్యలు గుర్తించి పరిష్కరిస్తున్నామని అన్నారు.

Also Read:Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఆక్టోపస్ మాక్ డ్రిల్.. లోపాలపై ఆగ్రహం..

వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ.. ఇతర ఆదాయ వనరులపై దృష్టి పెట్టేలా శిక్షణ ఇచ్చాం. విలేజ్ ఛాంపియన్స్ గా వారిని గుర్తించి వారి ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ప్రతి గ్రామంలో క్రికెట్ తో‌పాటు ఇతర క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. మా ఫౌండేషన్ ద్వారా ఉచితంగా క్రికెట్ కిట్ లు ఇస్తున్నాం. ఉపాధి మార్గాలు పెంచుకునేలా రుణ మేళాలు నిర్వహిస్తున్నాం. ఆరు నెలల్లో అనేక రూపాలలో ప్రజల్లో అవగాహన, చైతన్యం తెస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా యువతలో ప్రతిభను గుర్తిస్తున్నాం. జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.

Also Read:Delhi: ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం.. బయటపడ్డ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు.. షాకైన అధికారులు

ఇంట్లో ఉండే మహిళలు కూడా ఆదాయాన్ని పెంచుకునేలా చూడాలని సీఎం‌ ఆదేశించారు. అందుకు అనుగుణంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పార్లమెంటులో కూడా అనేక సమస్యలను నేను ప్రస్తావించాను. 305 ఎకరాల్లో విజయవాడ ఆటోనగర్ ఉంది. ఇది చాలా తక్కువ స్థలం అని సీఎం దృష్టి కి తీసుకెళ్లాం. కింద రోడ్, పైన మెట్రో ఉండేలా అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నిడమానూరు వరకు రోడ్ అభివృద్ధి జరుగుతుంది.

Also Read:BRS : శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

విజయవాడలో రైల్వే లైన్ ఎక్కువ.. వీటికి‌ పరిష్కార మార్గాలు చూస్తున్నాం. ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం మాది ప్రజలు కూడా తమ సూచనలు, సలహాలు ఇచ్చి విజయవాడ, ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందినా విజయవాడ ముఖ ద్వారం. విజయవాడ నగరంలో డ్రైనేజీ సమస్యతో సహా అన్నీ త్వరలో పరిష్కరిస్తాం. ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన స్టేడియాలను అభివృద్ధి చేస్తాం.. ఎన్టీఆర్‌ జిల్లాలో ఉన్న ప్రాథమిక‌ వైద్య కేంద్రాలలో సౌకర్యాలు కల్పిస్తామని కేశినేని చిన్ని తెలిపారు.