Kesineni Chinni: బెజవాడ లోక్‌సభ స్థానంలో ఎంపీ, వైసీపీ అభ్యర్థి అయిన అన్న కేశినేని నాని, తమ్ముడు, టీడీపీ అభ్యర్థి అయిన కేశినేని చిన్ని మధ్య.. మాటల యుద్ధమే నడుస్తోంది.. కేశినేని నానిపై మరోసారి విరుచుకుపడ్డారు చిన్ని.. నా మీద దొంగ కేసులు పెట్టాడు.. ఎంపీ స్టిక్కర్ వేసి తిరుగుతున్నానని చెప్పాడు.. పోలీసులు దీన్ని ఎక్కడా నిరూపించలేదన్నారు. నేను బ్యాంకులకు డబ్బులు ఎగగొట్టలేదు, ప్రజలను మోసం చేయలేదని స్పష్టం చేశారు. కేశినేని నాని సొంత కార్మికులు జీతాలు ఇవ్వలేదని గుంటూరు లేబర్ కోర్ట్ లో కేసులు పెట్టారని గుర్తుచేసిన ఆయన.. కేశినేని నానికి మైండ్ పని చేయడం లేదని ఫైర్ అయ్యారు.
Read Also: Supreme Court: పక్షులు అంతరించిపోతున్నాయి.. వాతావరణ మార్పులపై తొలిసారిగా సుప్రీంకోర్టు ఆదేశం
నువ్వు అమరావతి కావాలంటావు..! నువ్వే వద్దు అంటావు.. నీకు మైండ్ పనిచేయడం లేదని మండిపడ్డారు కేశినేని చిన్ని.. మూడు సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నా.. నేను ఎక్కడా కేశినేని నాని తమ్ముడు అని చెప్పుకోలేదన్న ఆయన.. 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న కేశినేని నాని ఆఫీస్ కి నేను రాలేదన్నారు. నేను ఎప్పుడు మీడియా ముందు కేశినేని నాని తమ్ముడు నీ అని మాట్లాడలేదన్నారు. 33000 ఎకరాలు ఇచ్చిన రైతులకు లేని బాధ నీకెందుకు కేశినేని నాని అని దుయ్యబట్టారు.. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు కోరుకుంటున్నారని తెలిపారు విజయవాడ లోక్‌సభ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి కేశినేని చిన్ని. మరోవైపు.. టీడీపీతో పాటు తన తమ్ముడు కేశినేని చిన్నిపై ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్లు చేస్తున్న విషయం విదితమే.
