NTV Telugu Site icon

Kesineni Nani: లోక్‌సభ సభ్యత్వానికి కేశినేని నాని రాజీనామా

Mp Kesineni Nani

Mp Kesineni Nani

Kesineni Nani: విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. తన రాజీనామాను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు మెయిల్‌ ద్వారా పంపించారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన కేశినేని నాని.. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌ తన రాజీనామాను ఆమోదించిన తర్వాత వైసీపీలో చేరనున్నట్లు కేశినేని నాని ప్రకటించారు.

Read Also: Magunta Sreenivasulu Reddy: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీపై మరోసారి ప్రతిష్టంభన.

సీఎం జగన్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపు కోసం పని చేశానని, చంద్రబాబు చెబితే కొందరికి నెల వారీ జీతాలు కూడా ఇచ్చానన్నారు. 2014కు ముందు టీడీపీలో చేరతానంటే.. చాలా మంది మా సామాజిక వర్గం వాళ్లే నన్ను మందలించి చేరొద్దన్నారని కేశినేని నాని పేర్కొన్నారు. రాజకీయాల కోసం రూ. 2 వేల కోట్ల ఆస్తులను అమ్ముకున్నానని ఆయన వెల్లడించారు. చంద్రబాబు తీరుతో వ్యాపారాన్ని కూడా ఆపేశానన్నారు. చంద్రబాబు మోసగాడని తెలుసు కానీ.. పచ్చి మోసగాడని అనుకోలేదన్నారు. ఇప్పుడు తాను ఫ్రీ బర్డ్ అంటూ నాని చెప్పుకొచ్చారు. జగన్ పేదల పక్షపాతి.. నిరుపేదల పక్షపాతి అని, రూ. 2 లక్షల కోట్లు పేదలకు పంచారన్నారు. జగన్‌తో కలిసి కలిసి పని చేస్తానన్నారు. . ఎంపీ పదవి రాజీనామా చేస్తా.. దానికి ఆమోదం పొందగానే.. త్వరలో వైసీపీలో చేరతానన్నారు. .