NTV Telugu Site icon

K. Keshava Rao: కాంగ్రెస్ నా సొంత ఇల్లు.. నేను కాంగ్రెస్ మనిషిని

K.keshava Rao

K.keshava Rao

కే.కేశవరావును తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో ఉన్న ఈ ఇరువురు నేతలు కలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నా సొంత ఇల్లు.. నేను కాంగ్రెస్ మనిషిని’ అని అన్నారు. ఇప్పుడు స్వేచ్చ ఫీలింగ్ ఉంది.. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ లోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య బద్దంగా ఉందని అన్నారు. ఆరు నెలల్లో ఎవరిని కూడా అంచనా వేయలేమని తెలిపారు. ఆరు నెలల్లో ప్రతిదీ కార్యక్రమం అభివృద్ధితో కూడిందే చేస్తున్నారని.. ఫ్యామిలీ పబ్లిసిటీ గత ప్రభుత్వంలో ఉన్న వారు చేశారని దుయ్యబట్టారు. తాను నైతిక విలువలతో రాజీనామా చేశానని చెప్పారు. రాజ్యసభ ఛైర్మన్ కు కూడా అదే చెప్పానని కేశవరావు పేర్కొన్నారు.

Read Also: Myanmar: ఉద్యోగులకు జీతం పెంచిన యజమానికి జైలు శిక్ష..కారణం ఇదే..?

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేకే రాజీనామా విషయంలో పార్టీ అంతా కలిసి నిర్ణయం తీసుకున్న అంశమేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి ఏది మంచో కేకే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కేశవరావు సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

Read Also: Oppo Reno 12 Series: జులై 12న భారత్‌లో ఒప్పో రెనో 12 సిరీస్‌ 5జీ ఫోన్‌ లాంచ్‌ .. ఏయే ఫీచర్లు ఉండొచ్చంటే?

కాగా.. ఈరోజు రాజ్యసభ సభ్యత్వానికి కే. కేశవరావు రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ను కలిసి రాజ్యసభ ఎంపీ పదవి రాజీనామా లేఖను ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే.. బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎన్నిక అయిన రాజ్యసభ మెంబర్గా కొనసాగలేనని తెలిపారు. నైతికతకు కట్టుబడి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.