NTV Telugu Site icon

Kerala IMax: ఫలించిన సినిమా ప్రేమికుల నిరీక్షణ.. కేరళలో మొదటి ఐమాక్స్ ప్రారంభం

Tvm Imax

Tvm Imax

Kerala IMax: సినిమా ప్రేమికుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. కేరళలోని మొదటి ఐమాక్స్ థియేటర్ తిరువనంతపురంలో ప్రారంభమంది. లులు మాల్‌లోని పీవీఆర్ సూపర్‌ప్లెక్స్‌లో ఐమాక్స్ స్క్రీనింగ్ ప్రారంభమైంది. ప్రారంభ చిత్రం హాలీవుడ్ చిత్రం అవతార్ ది వే ఆఫ్ వాటర్. డిసెంబర్ 16న అవతార్ విడుదలైన రోజున తిరువనంతపురంలోని ఐమాక్స్ ని ప్రారంభిస్తామని మేకర్స్ మొదట ప్రకటించారు, కానీ అది జరగలేదు. అందుబాటులోకి వచ్చిన మొదటి రోజు థియేటర్ కు మంచి స్పందన వచ్చింది. అవతార్ విడుదలై కొన్ని రోజులు కావస్తున్నా ఐమాక్స్ లో సినిమా చూసేందుకు సినీ ప్రియులు ఎగబడ్డారు. టిక్కెట్ ధరలు రూ.1230, రూ.930, రూ.830. కేరళలో ప్రారంభమైన ఐమాక్స్ దేశంలో 22వది.

Read Also: Solar Stove : గ్యాస్ ధర పెరిగినా డోంట్ వర్రీ.. వచ్చేస్తోంది సోలార్ స్టవ్

కేరళకు చెందిన మొట్టమొదటి ఐమాక్స్ తిరువనంతపురంలోని లులు మాల్‌కు వస్తుందని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో పుకారు వచ్చింది. ఐమాక్స్ ఆసియా థియేటర్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రీతమ్ డేనియల్ అక్టోబర్‌లో ట్విట్టర్‌లో ఈ ఊహాగానాలకు ముగింపు పలికారు. కేరళలో ఐమాక్స్ స్క్రీన్ల ప్రారంభానికి సంబంధించి ప్రీతమ్ తిరువనంతపురం, కొచ్చిలను సందర్శించారు. తిరువనంతపురం లులు మాల్‌లోని ఐమాక్స్ కేరళలో కార్యకలాపాలకు నాంది మాత్రమేనని ఆయన తెలియజేశారు. కొచ్చిలో ఐమాక్స్ సాధ్యాసాధ్యాలను కూడా బృందం పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా సెంటర్ స్క్వేర్ మాల్‌లోని సినీపోలీస్‌, లులుమాల్‌లోని పీవీఆర్‌లను సందర్శించారు. కొచ్చి కూడా ఐమాక్స్ థియేటర్‌కి అనువైన నగరంగా పరిగణించారు.

Read Also: Guinness Record: వీడు మామూలోడు కాదు.. గడ్డంతో గిన్నీస్ రికార్డ్

ఇదిలా ఉంటే, అవతార్ ది వే ఆఫ్ వాటర్ ప్రపంచ సినిమా చరిత్రలో అతిపెద్ద విజయం. డిసెంబర్ 2009లో విడుదలైన ఈ చిత్రం 2019లో విడుదలైన అవెంజర్స్ ఎండ్‌గేమ్‌తో రెండో స్థానానికి చేరుకుంది. అయితే అవతార్ 2 విడుదలకు ముందే అవతార్ ప్రపంచవ్యాప్తంగా రీరిలైజైంది. మార్చి 2021లో రీ రిలీజైన అవతార్ మూవీ ఉత్తమ కలెక్షన్లను సాధించింది. అవతార్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్స్ లిస్ట్‌లో మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది.

Show comments