Sabarimala Entry: శబరిమల ఆలయ ప్రవేశంపై కేరళం ప్రభుత్వం ‘యూటర్న్’.. 50 ఏళ్లలోపు మహిళలు ప్రవేశించకూడదంటూ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala Entry: శబరిమల ఆలయ ప్రవేశంపై మరోమారు దుమారం రేగుతుంది. కేరళంలో ఉన్న ప్రభుత్వం శబరిమల ఆలయ ప్రవేశం అంశంలో తన గత వైఖరిని మార్చుకున్నట్లు అర్థమవుతుంది. గత కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలను కాపాడే దిశగా.. 50 ఏళ్లలోపు మహిళలు ఆలయంలోకి ప్రవేశించకూడదని సుప్రీంకోర్టుకు తెలియజేయాలని నిర్ణయించుకుంది.
2018లో మహిళలకు అన్ని వయసుల్లోనూ ప్రవేశం అనుమతించాలని మద్దతు తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు భక్తుల భావాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంట్ల సమాచారం. అయితే ఇది ఇప్పుడు రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
శుక్రవారం (మార్చి 13) నిర్వహించిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకుంది. శబరిమల ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) తీసుకున్న తీర్మానానికి ప్రభుత్వం మద్దతు తెలిపింది. సంప్రదాయాల ప్రకారం మాసిక ధర్మం వచ్చే వయస్సులో ఉన్న (50 ఏళ్లలోపు మహిళలు) ఆలయంలో ప్రవేశించరాదని పేర్కొంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం మార్చి 14లోపు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుంది.
2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశం అనుమతించబడింది. అయితే ఆ తీర్పుపై పునర్విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. ఏప్రిల్ 7 నుంచి ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ముందు ఈ కేసులపై విచారణ జరగనుంది.
Egg Prices Drop: యుద్ధానికి గుడ్లతో ఉన్న లింకేంటి..? భారత్‌లో గుడ్ల ధర ఎందుకు పడిపోయింది..?
శబరిమల అంశంలో ప్రభుత్వ యూటర్న్‌పై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల లాభం కోసం ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుందని పార్టీ నేత కుమ్మణం రాజశేఖరన్ ఆరోపించారు. ఇంతకుముందు ఈ అంశంపై ఆందోళనలు చేసిన వారిపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.
ఇదిలా ఉండగా.. CPI-M రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ ఈ నిర్ణయం పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధం కాదని అన్నారు. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలు కేవలం మహిళల ప్రవేశంపై మాత్రమే కాకుండా మత సంప్రదాయాలు, రాజ్యాంగ పరమైన అంశాలపై కూడా ఉన్నాయని ఆయన వివరించారు. భక్తుల భావాలు, చట్టపరమైన అంశాలను సమతుల్యం చేసే విధంగా ప్రభుత్వం స్పందిస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?