Kerala Wedding Goes Viral as Bride’s Father Uses QR Code: భారతదేశంలో డిజిటల్ విప్లవం ఎంత వేగంగా పాకిందో.. ఇప్పుడు పెళ్లి వేడుకల్లో కూడా అదే రంగు కనిపిస్తోంది. టీ దుకాణం నుంచి బంగారు దుకాణం వరకు అందరూ వాడే క్యూఆర్ కోడ్‌లు ఇప్పుడు పెళ్లిళ్లలో కూడా చదివింపుల కోసం ఉపయోగపడటం కొత్త ట్రెండుగా మారుతోంది. తాజాగా కేరళలో జరిగిన ఓ వివాహం ఇందుకు ఉదాహరణగా నిలిచింది. ఈ పెళ్లిలో వధువు తండ్రి తెల్లటి షర్ట్ జేబుపై పేటీఎం క్యూఆర్ కోడ్‌ను అతికించుకుని అతిథుల మధ్య తిరిగాడు. రూపాయి, వంద, వెయ్యి, ఎంత ఇచ్చినా.. క్యాష్ కాదు.. స్కాన్ చేసి UPI ద్వారా పంపాలి! ఇదే ఆయన స్టైలు.
READ MORE: Yanamala Ramakrishnudu: ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతాం..! యనమల సంచలన వ్యాఖ్యలు..
పెళ్లికి హాజరైన బంధువులు, స్నేహితులు కూడా ఇదేదో కొత్త ఎక్స్‌పీరియన్స్ అని భావించి తమ ఫోన్లతో క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి డిజిటల్ చదివింపులు చేసేశారు. ఈ సన్నివేశాలన్నీ వీడియోగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు “ఇదే అసలైన డిజిటల్ ఇండియా!”, “కేరళ అక్షరాస్యత ఫలితం ఇది” అంటూ ప్రశంసిస్తే.. మరికొందరు మాత్రం “ఇది యాచకత్వానికి కొత్త పద్ధతి”, “కవర్ సంప్రదాయం పోయింది” అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
READ MORE: Tollywood : బాలీవుడ్ సీనియర్ బ్యూటీస్ బ్యాక్ టు టాలీవుడ్
డిజిటల్ చెల్లింపులు ఎంతగా పెరిగాయో.. ఈరోజు దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో క్యూఆర్ కోడ్‌లు వినియోగంలో ఉన్నాయి. శుభకార్యాల్లో బ్యాండ్ వాయిద్యకారులు కూడా డ్రమ్‌పై క్యూఆర్ కోడ్ పెట్టుకుని నగదు స్వీకరించిన రోజులు ఉన్నాయి. కానీ పెళ్లి చదివింపుల కోసం వధువు తండ్రి క్యూఆర్ కోడ్ ధరిస్తూ తిరగడం మాత్రం చాలా అరుదు. అలా చూసిన వారికి నవ్వొచ్చినా, ఇది టెక్నాలజీ మన జీవనశైలిలోకి ఎంతగా చేరిపోయిందో చూపిస్తుంది. కొంతమంది ఈ వీడియో నిజమా? లేక ప్లాన్‌డ్ వీడియోనా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అది వినోదం కోసం చేసినదే కావచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. ఇదంతా ఒకవైపు.. మరోవైపు, పెళ్లిళ్లు కూడా కాలానుగుణంగా మారుతున్నాయి. వాట్సాప్ ఆహ్వానాలు, ఆన్‌లైన్ గిఫ్ట్‌లు, UPI రిటర్న్ గిఫ్ట్‌లు కామన్ అయిపోయాయి. ఇక రాబోయే రోజుల్లో పెళ్లి కట్నాల ఎన్వలప్‌ను కూడా క్యూఆర్ కోడ్ రీప్లేస్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఏది ఏమైనా.. కేరళ పెళ్లిలో క్యూఆర్ కోడ్ చదివింపులు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసి, టెక్నాలజీ ఎక్కడిదాకా వెళ్లిందో మరోసారి రుజువు చేసింది.