భారతీయ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా పడింది. నిమిషా ఉరిశిక్ష అమలును వాయిదా వేసిన యెమెన్. నిమిష ప్రియను రక్షించేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది భారత సర్కార్. హత్య కేసులో నిమిషా ప్రియకు మరణశిక్ష విధించింది అక్కడి ప్రభుత్వం. జూలై 16, బుధవారం ఉరిశిక్ష అమలు చేయాలని ముందుగా నిర్ణయించారు. ఆమె 2017 నుంచి యెమెన్‌లో జైలులో ఉంది. యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన కేసులో నిమిషా దోషిగా తేలింది. తన పాస్‌పోర్ట్‌ను అతని వద్ద డిపాజిట్ చేయడానికి మహదీకి అనస్థీషియా ఇంజెక్షన్లు ఇచ్చినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఇంజెక్షన్ల కారణంగా మహదీ మరణించాడు.
Also Read:Janaki V vs State of Kerala : టైటిల్ మార్చిన జానకి సినిమా ట్రైలర్ వచ్చేసింది!
కేరళలోని పాలక్కాడ్ నివాసి అయిన నర్స్ నిమిషా గత దశాబ్ద కాలంగా తన భర్త, కుమార్తెతో కలిసి యెమెన్‌లో పనిచేస్తోంది. 2016లో, యెమెన్‌లో అంతర్యుద్ధం కారణంగా, అంతర్జాతీయ ప్రయాణం పరిమితమైంది. కానీ అంతకు ముందు, 2014లో, ఆమె భర్త, కుమార్తె భారత్ కు తిరిగి వచ్చారు. కానీ నిమిషా తిరిగి రాలేకపోయింది. దీని తరువాత, జూలై 2017లో యెమెన్ పౌరుడిని హత్య చేసినట్లు నర్సుపై ఆరోపణలు వచ్చాయి. అందువల్ల, మార్చి 7, 2018న, యెమెన్‌లోని కోర్టు నిమిషా మరణశిక్షను సమర్థించింది.
