Kerala lottery : కొంతమంది అదృష్టం వెన్నంటే ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతది. అలాగే ఓ వ్యక్తికి రూ.12కోట్లు లాటరీలో తగిలాయి. కేరళలో బుధవారం ఓ లాటరీ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఓ వ్యక్తికి 12 కోట్ల లాటరీ తగిలింది. కేరళ లాటరీ డిపార్ట్మెంట్ విషు బంపర్ లాటరీ 2023 పేరుతో… తిరువనంతపురం జిల్లాలో ఈ టికెట్లను అమ్మింది. ఈ లాటరీ కి సంబంధించిన డ్రా బుధవారం మధ్యాహ్నం జరిగింది. ఈ డ్రాలో మలప్పురం జిల్లా తిరువూరులోని ఎం.5087 ఏజెన్సీకి చెందిన ఆదర్శ అనే వ్యక్తి అమ్మిన టికెట్ కు మొదటి బహుమతి వచ్చింది. అయితే, మొదటి బహుమతి రూ.12కోట్లు టికెట్ ను కొన్న వ్యక్తి ఎవరనేది ఇంకా వెలుగులోకి రాలేదు. ఈ టికెట్ నెంబర్ వీఈ 475588.
Read Also:TS EAMCET Results 2023: ఎంసెట్ ఫలితాలు విడుదల.. https://ntvtelugu.com లో చెక్ చేసుకోండి
ఈ టికెట్ మీద గెలిచిన మొత్తంలో 10శాతం ఏజెన్సీకి కమిషన్.. 3శాతం ఇతర పన్నులు పోతాయి. వీటన్నింటినీ మినహాయించుకుని మిగిలిన మొత్తం రూ.7.20కోట్లు మొదటి బహుమతి విజేతకు అందనుంది. ఇదే డ్రాలో రెండో బహుమతిగా.. ఒక్కొక్కరికి కోటి చొప్పున ఆరుగురికి.. సెకండ్ బహుమతి వచ్చింది. ఇదిలా ఉండగా, విషు బంపర్ 2023 ఆరు సిరీస్‌లలో ప్రారంభించబడింది. VA, VB, VC, VD, VE, VG. విషు బంపర్ 2023లో మొదటి బహుమతి రూ. 12 కోట్లు. ఆరుగురికి ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున రెండో బహుమతి లభిస్తుంది. 10 లక్షల విలువైన తృతీయ బహుమతిని ఆరుగురికి అందజేయనున్నారు.
Read Also:Karnataka: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు బీజేపీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు
విషు బంపర్ 2023 ఫలితాలను డ్రా ద్వారా ప్రకటించిన వెంటనే కేరళ లాటరీ విభాగం అధికారిక వెబ్‌సైట్ — www.keralalotteries.com –లో చూసుకోవచ్చు. 30 రోజుల్లోగా విజేతలు టిక్కెట్‌ను లాటరీ విభాగానికి సమర్పించాలి. అంతకు ముందు కేరళ ప్రభుత్వ గెజిట్‌లో ఫలితాన్ని ధృవీకరించాలని టిక్కెట్ హోల్డర్‌లకు తెలియజేయబడింది.