Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Kerala Local Body Polls Bjps Historic Thiruvananthapuram Win Shashi Tharoor Flags Political Shift

Kerala: కేరళలో లోకల్ పోల్స్‌లో బీజేపీ సంచలనం.. “రాజధాని” కైవసం..

Published Date :December 14, 2025 , 11:37 am
By BV Reddy
  • కేరళ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ సంచలనం..
  • ఏకంగా రాజధానిని కైవసం చేసుకున్న కమలం..
  • తిరువనంతపురం కార్పొరేషన్ బీజేపీ చేతుల్లోకి..
Kerala: కేరళలో లోకల్ పోల్స్‌లో బీజేపీ సంచలనం.. “రాజధాని” కైవసం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kerala: వచ్చే ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ, ఈ ఎన్నికలకు ముందే అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్)కు ఎదురుదెబ్బ తగిలింది. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ముందంజలో ఉంది. ఆరు మున్సిపల్ సంస్థలలో నాలుగింటిలో మరియు 14 జిల్లా పరిషత్‌లలో కాంగ్రెస్ ముందుంది. వామపక్ష ఎల్డీఎఫ్ మాత్రం ఆరింటిలోనే ముందంజలో ఉంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లకు కంచుకోటగా ఉన్న కేరళలో కమలం వికసించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా కేరళ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది.

కేరళ రాజధాని తిరువనంతపురంలోని 101 మంది సభ్యులున్న మున్సిపల్ కార్పొరేషన్‌లో 50 స్థానాలను గెలుచుకుంది. ఈ రేంజ్లో మెజారిటీ సాధించడం ఇదే తొలిసారి. బీజేపీ గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకని ఉనికి చాటింది. ఇప్పుడు రాజధానినే కైవసం చేసుకుంది. మరోవైపు, తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇటీవల కాలంలో బీజేపీకి దగ్గరవుతున్న సందర్భంలో ఈ ఫలితాలు వచ్చాయి. ఈ మున్సిపల్ కార్పొరేషన్‌లో వామపక్షానిదే హవా, కానీ ఈ సారి మాత్రం ఫలితాలు తారుమారయ్యాయి.

Read Also: Fire Accident: గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయల ఆస్తి నష్టం

గతంలో ఈ కార్పొరేషన్‌లో 100 స్థానాల్లో సీపీఎం కు 51, బీజేపీకి 35, కాంగ్రెస్ కూటమికి 10 సీట్లు ఉండేవి. ఇప్పుడు సీట్ల సంఖ్య 101కి పెరిగాయి. ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు, సీపీఎం కూటమికి 29, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కి 19 సీట్లు వచ్చాయి. మరో రెండు స్థానాలను స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. ఈ గెలుపుపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. ఇది చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఇది బీజేపీ కార్యకర్తల కఠోర శ్రమకు నిదర్శమని అన్నారు. బీజేపీని గెలిపించిన తిరువనంతపురం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉంటే, బీజేపీ గెలుపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ తిరువనంతపురంలో బీజేపీ సాధించిన చారిత్రాత్మక పనితీరును కూడా నేను గుర్తించాలనుకుంటున్నాను. నగర కార్పొరేషన్‌లో వారి గణనీయమైన విజయానికి నా వినయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను – ఇది రాజధాని రాజకీయ రంగంలో ఒక ముఖ్యమైన మార్పును సూచించే బలమైన ప్రదర్శన. 45 సంవత్సరాల ఎల్‌డిఎఫ్ దుర్పరిపాలన నుండి మార్పు కోసం నేను ప్రచారం చేశాను, కానీ ఓటర్లు చివరికి పాలనలో స్పష్టమైన మార్పును కోరుకున్న మరో పార్టీకి బహుమతిగా ఇచ్చారు,’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BJP Kerala
  • Kerala local body elections
  • Kerala Politics
  • LDF
  • NDA Kerala

తాజావార్తలు

  • Prize Money: ఫైనల్‌లో గెలిచిన జట్టుపై కాసుల వర్షం.. మొత్తం ప్రైజ్ మనీ ఎంతంటే?

  • Sunil Gavaskar: ఆ ఇద్దర్నీ ఫైనల్‌ నుంచి తప్పించాల్సిందే.. సునీల్‌ గావస్కర్‌ సంచలన వ్యాఖ్యలు..

  • Mythri Movie Makers: మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ మామూలుగా లేదుగా.. సల్మాన్ ఖాన్‌తో సినిమా! డైరెక్టర్ ఎవరంటే..

  • PM Modi: తృణమూల్ అహంకారం ముక్కలవుతుంది.. మమతా సర్కార్‌పై ప్రధాని ఫైర్..

  • Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!

ట్రెండింగ్‌

  • IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

  • Sanju Samson: ఫైనల్‌కు ముందు సంజు భావోద్వేగ సందేశం.. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే..!

  • India Playing XI: భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు కొత్త కాంబినేషన్!

  • Team India: టీమిండియాలో భారీ మార్పులు.. సూర్యకు వీడ్కోలు, అయ్యర్‌కు నిరాశ!

  • UK07 Rider: “అమ్మా నీ ప్రేమ కావాలి”.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోనే ఫేమస్ యూట్యూబర్ సూసైడ్ అటెంప్ట్.. కట్‌చేస్తే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions