NTV Telugu Site icon

Kerala High Court: గర్భం వద్దనుకుంటే భర్త అనుమతి అక్కర్లేదు..

Kerala Highcourt

Kerala Highcourt

Kerala High Court: మహిళ గర్భం విషయంలో కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మహిళకు గర్భం వద్దనుకుంటే మెడికల్ టెర్మినేషన్‌ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ (ఎంటీపీ యాక్ట్‌) కింద భర్త అనుమతి అవసరం లేదని కేరళ ధర్మాసనం తెలిపింది. భర్త నుంచి విడిపోయానని చెప్పుకునే మహిళ సైతం తన గర్భాన్ని తొలిగించాలనుకుంటే ఎంటీపీ యాక్ట్‌ కింద భర్త అనుమతి అవసరం లేదంటూ కేరళ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. గర్భిణీ స్త్రీకి చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నా లేదా వితంతువు కానప్పటికీ గర్భధారణ సమయంలో వైవాహిక జీవితంలో పలు మార్పులు వస్తే తాను గర్భాన్ని కొనసాగించమనే హక్కు భర్తకు లేదని తేల్చి చెప్పింది.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఓ యువతి తాను డిగ్రీ చదవుతుండగా అదే ప్రాంతంలో బస్సు కండక్టర్‌గా పని చేసే వ్యక్తిని ప్రేమించి.. కుటుంబసభ్యులకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంది. వివాహం అనంతరం తన భర్త, అత్త కట్నం కోసం వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించాలని పిటిషన్‌లో తెలిపింది. ఆ సమయంలో తాను గర్భంతో ఉండటంతో మరింత వేధింపులు అధికమయ్యాయని, దీనికి తోడు ఎలాంటి ఆర్థిక భరోసా ఇవ్వకపోవడంతో అతడిని విడిచి వేరుగా ఉంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఆమె తన గర్భాన్ని తొలగించుకుందామని ఆస్పత్రికి వెళ్లితే వైద్యులు అందుకు నిరాకరించడమే కాకుండా విడాకులు తీసుకున్నట్లు పత్రాలు సమర్పించాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్‌ వీజీ అరుణ్‌ వితంతువు లేదా చట్టబద్ధంగా విడిపోయిన వాళ్లకు వర్తించే ఎంటీపీ చట్టాన్ని ప్రస్తావిస్తూ చారిత్రాత్మక తీర్పును వెలువరించారు. పైగా సదరు మహిళలకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా సదరు పిటిషనర్‌కు గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతిని మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.