Site icon NTV Telugu

Mollywood Heroines : పెన్షన్ తీసుకునే వయసొస్తున్నపెళ్ళికి నో చెప్తున్న కేరళ కుట్టీలు..

Mollywood (2)

Mollywood (2)

30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే చేయట్లేదు మాలీవుడ్ ముద్దుగుమ్మలు. థర్డీ క్రాస్ చేస్తే పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కెరీర్ ఫస్ట్, మ్యారేజ్ నెక్ట్స్ అంటున్నారు. సోలో లైఫ్ సో బెటరని ఫీలవుతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు సోలో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. నియర్లీ 40కి చేరువౌతున్న పార్వతి తిరువోతు పెళ్లి ఊసేత్తట్లేదు. ఇక వీరి జాబితాలోకి ఎప్పుడో చేరిపోయింది నిత్యా మీనన్. వివాహ బంధం గురించి ఆలోచించేంత టైం తనకు లేదంటోంది. 34 ఏళ్ల మడోన్నా సెబాస్టియన్ కెరీర్ ఫస్ట్.. మ్యారేజ్ నెక్ట్స్ అంటోంది. జీవితంలో అసలు పెళ్లే చేసుకోనంటోంది మరో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ.

Also Read : Mrunal : వచ్చే ఏడాది బాక్సాఫీస్‌పై దండయాత్రకు రెడీ అవుతున్న మృణాల్ ఠాకూర్

హనీ రోజ్‌కు పెళ్లి చేసుకొని హనీమూన్‌కు వెళ్లాలన్న ఆలోచనే లేనట్లు కనిపిస్తోంది. కాల్షీట్లు ఖాళీ లేకపోవడం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుందనుకుంటే పొరపాటు. ఆమె చేతిలో రాచెల్ తప్ప మరో ప్రాజెక్టు లేదు.ఇక మరో మాలీవుడ్ సుందరి మాళవిక మోహనన్‌ది కూడా ఇదే దారి. ఇప్పుడిప్పుడే బిగ్ స్టార్స్, పాన్ ఇండియన్ చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతోంది మాళవిక. ఇక లోకతో ఇప్పుడే గ్రోత్ చూసిన కళ్యాణీ ప్రియదర్శన్‌ కెరీర్‌పై గట్టిగా ఫోకస్ చేస్తుంది . భాజా భజంత్రీలు, పప్పన్నం టాపిక్ ఇప్పట్లో తేవద్దు అంటోంది. ఇక 30లోకి ఎంటరైన సంయుక్త మీనన్, అపర్ణా బాల మురళి కెరీర్ ప్రెజెంట్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఇలాంటి టైంలో కెరీర్‌ను పణంగా పెట్టి పర్సనల్ లైఫ్ రిస్క్‌లో పెట్టుకోవాలనుకోవడం లేదు భామలు. సింగిల్ లైఫ్ బెటర్ అంటూ సినిమాలపైనే లవ్ అండ్ ఎఫెక్షన్ పెంచుకుంటున్నారు

Exit mobile version