NTV Telugu Site icon

Pinarayi Vijayan: కేరళ సీఎంకు హైకోర్టు షాక్.. కుమార్తెతో సహా నోటీసులు జారీ..

Pinarayi Vijayan

Pinarayi Vijayan

Kerala High Court : సీఎంఆర్‌ఎల్‌, ఎక్సాలాజిక్‌ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల పై విజిలెన్స్‌ దర్యాప్తునకు విజిలెన్స్‌ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మాథ్యూ కుజల్‌నాదన్‌ దాఖలు చేసిన అప్పీల్‌ పై కేరళ హైకోర్టు ( Kerala High Court) మంగళవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Pinarayi Vijayan), ఆయన కుమార్తె వీణ(Veena) కు నోటీసులు జారీ చేసింది. సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు., న్యాయవాది గిల్బర్ట్ జార్జ్ కొర్రెయా R1 (పినరయి విజయన్), R7 (వీణా తైకండియిల్) కోసం నోటీసులు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి CMRL మరియు ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసు కూడా జారీ చేశారు.

Sapthami Gowda: స్టార్ హీరో ఫ్యామిలీలో విడాకుల చిచ్చు.. పరువు నష్టం దావా వేసిన కాంతార నటి

కుజల్‌నాదన్‌ ఆరోపణలకు మద్దతు ఇవ్వడానికి ప్రాథమిక సాక్ష్యాలు లేవని అలాగే అందువల్ల పిటిషన్ అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని., సమర్పించిన పత్రాలు ఆరోపణలను రుజువు చేయలేవని పేర్కొంటూ ఎమ్మెల్యే పిటిషన్‌ను విజిలెన్స్ కోర్టు తిరస్కరించింది. తాను సమర్పించిన సాక్ష్యాలను కూలంకషంగా పరిశీలించకుండానే విజిలెన్స్ కోర్టు ఆదేశాలు ఇచ్చిందని కుజల్‌నాదన్ తన రివిజన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Viral News: బైక్‌పై ఏడుగురు ప్రయాణం.. పోలీసులు భారీగా చలాన్

ఆదాయపు పన్ను శాఖ మధ్యంతర సెటిల్‌మెంట్ బోర్డు వెల్లడించిన వివరాల ఆధారంగా.. ఈ పిటిషన్‌ దాఖలైంది. వీణా యాజమాన్యంలోని ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కు CMRL చెల్లింపులు చేసిందని బోర్డు గుర్తించింది. దీనిపై జులై 2న విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా, కేసు విచారణలో ఉన్న సమయంలో మరణించిన కలమసేరికి చెందిన గిరీష్ బాబు ఇదే అంశంపై దాఖలు చేసిన పిటిషన్‌ను జూలై 3న విచారించాలని కోర్టు నిర్ణయించింది. CMRL పే ఆఫ్ కేసులో విచారణ కోసం ఆయన చేసిన అభ్యర్థనను తిరస్కరిస్తూ విజిలెన్స్ కోర్టు, మువాట్టుపుజా ఇచ్చిన ఉత్తర్వులపై పిటిషన్ దాఖలైంది. కేసు విచారణలో ఉండగానే గిరీష్‌బాబు చనిపోయాడు. ఆ తర్వాత, పిటిషనర్ తరపున వాదించడానికి హైకోర్టు న్యాయవాది అఖిల్ విజయ్‌ను అమికస్ క్యూరీగా కోర్టు నియమించింది.