All Set for Voting: 3 రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం..!
- మూడు రాష్ట్రాల్లో పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- కేరళలో ఎల్డీఎఫ్ vs యుడిఎఫ్ vs బీజేపీ హోరాహోరీ
- భద్రతకు భారీ బందోబస్తు… సున్నిత కేంద్రాల్లో సీఆర్పీఎఫ్ మోహరింపు
- నగదు స్వాధీనం, ముందస్తు అరెస్టులతో అప్రమత్తమైన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా రాజకీయ వేడి పెంచుతున్న కేరళ, అస్సాం , కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు (ఏప్రిల్ 9) ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముఖ్యంగా కేరళలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎల్డీఎఫ్ (LDF), ఎలాగైనా పీఠాన్ని దక్కించుకోవాలని యుడిఎఫ్ (UDF) , సత్తా చాటాలని బిజెపి (BJP) కూటములు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కేరళలోని 140 అసెంబ్లీ స్థానాల కోసం మొత్తం 883 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, సుమారు 2 కోట్ల 71 లక్షల మంది ఓటర్లు తమ తీర్పును ఇవ్వబోతున్నారు. ఇప్పటికే వృద్ధులు , దివ్యాంగులకు సంబంధించిన ‘హోమ్ ఓటింగ్’ ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు.
Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?
Also Read
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 30,471 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన అధికారులు, భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ‘జనమైత్రి’ పేరుతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సుమారు 76,000 మంది పోలీసు సిబ్బందిని విధుల్లో నియమించడమే కాకుండా, శబరిమల వంటి అటవీ ప్రాంతాల నుంచి రాజధాని త్రివేండ్రం వరకు ఉన్న 2,500 సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో సీఆర్పీఎఫ్ (CRPF) బలగాలను మోహరించారు. ఈ ఎన్నికల్లో మహిళా ప్రాధాన్యతను చాటుతూ 352 పోలింగ్ కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులే పర్యవేక్షించనున్నారు. అలాగే 37 కేంద్రాలను ప్రత్యేకంగా దివ్యాంగుల నిర్వహణలో ఉంచడం విశేషం.
Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!
ఎన్నికల నిబంధనల అమలులో భాగంగా పోలీసులు జరిపిన ముమ్మర తనిఖీల్లో ఇప్పటివరకు సుమారు 47 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గత ప్రచార సమయంలో ఘర్షణలు చోటుచేసుకున్న త్రిసూర్, పాలక్కాడ్ , కన్నూరు జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు వందల సంఖ్యలో ముందస్తు అరెస్టులు చేపట్టారు. అస్సాం , పుదుచ్చేరిలో కూడా పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు సాయంత్రం లోపు ఈ మూడు ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది, దీంతో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు