NTV Telugu Site icon

Kejriwal: బెయిల్ ఆర్డర్‌ స్టేపై సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్

Kehe

Kehe

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. బెయిల్ వచ్చిన ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. తీహార్ జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా హైకోర్టు స్టే విధించడంతో విడుదలపై బ్రేక్ పడింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ షాక్‌కు గురైంది. తాజాగా ఆదివారం హైకోర్టు స్టేపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారణ జరపాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Viral News: మీరు పునర్జన్మను నమ్ముతారా?.. ఈ ఐదేళ్ల బాలిక మాటలు వింటే ఆశ్చర్యపోతారు..

లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీ అనంతరం తీహార్ జైలుకు తరలించారు. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు 21 రోజులు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అనంతరం జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో లొంగిపోయారు. అయితే ఇటీవల ఢిల్లీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీన్ని ఈడీ హైకోర్టులో సవాల్ చేయగా.. స్టే విధించింది. కేజ్రీవాల్ తాజా పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: BMW CE 04: బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్