Site icon NTV Telugu

Keerthy Suresh : కీర్తి సురేష్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. ఈసారైనా హిట్టు వచ్చేనా?

Raftaar

Raftaar

టాలీవుడ్ మరియు కోలీవుడ్ ప్రేక్షకులకు తన నటనతో దగ్గరైన మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్‌లోకి భారీ అంచనాలతో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ‘బేబీ జాన్’ చిత్రంతో హిందీ వెండితెరకు పరిచయమయ్యారు. ఒక సాలిడ్ యాక్షన్ డ్రామాగా, గ్లామరస్ ఎంట్రీగా భావించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేక డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీంతో కీర్తి సురేష్ బాలీవుడ్  ఆశలు అడియాసలయ్యాయి.

Also Read : Rakasa : ‘రాకాస’ అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది : నిహారిక కొణిదెల

దాంతో లాంగ్ గ్యాప్ తీసుకుని మరోసారి బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోనుంది కీర్తి సురేష్. తన రెండో హిందీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. టాలెంటెడ్ నటుడు రాజ్ కుమార్ రావు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా  ‘రాఫ్తార్’ అనే సినిమాలో నటిస్తోంది. సైలెంట్ గా షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు ముస్తాబైంది. ఈ సినిమా మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు ఆదిత్య నింబల్కర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 24న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. రాజ్ కుమార్ రావు వంటి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోతో కీర్తి జతకట్టడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ‘బేబీ జాన్’ ఫలితంతో సంబంధం లేకుండా, ‘రాఫ్తార్’ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ లో తన సత్తా చాటుతుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. వరుణ్ ధావన్ తో నటించి ప్లాప్ తెచ్చుకున్న కీర్తి ఇప్పుడు రాజ్ కుమార్ రావు ఎలాంటి ఫలితం అందుకుంటుందో మరికొన్ని నెలల్లో తెలుస్తుంది.

Exit mobile version