కీర్తి సురేష్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి హీరోయిన్గా మంచి పేరును తెచ్చుకుంది.. స్టార్ హీరోల సరసన నటించింది.. మహానటి సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.. ఇక ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారు మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా శారీలో స్టైలిష్ లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఇక ఇటీవల బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా పాతుకుపోవాలని ట్రై చేస్తుంది.. ఇక ఈ మధ్య ఈవెంట్స్ లలో ఎక్కువగా కనిపిస్తుంది.. తాజాగా డైరెక్టర్ శంకర్ కూతురు రీసెప్షన్ లో మెరిసింది. అదిరిపోయే లుక్ లో బ్యూటిఫుల్ శారీలో మెరిసింది. శంకర్ కూతురు పెళ్లిలో కీర్తి సురేష్ కట్టుకున్న చీర ఖరీదు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. ఆ చీర చూడటానికి సింపుల్ గా ఉన్నా కూడా ధర మాత్రం షాక్ ఇస్తుంది.
ఆ చీర ఖరీదు అన్ని లక్షలు.. దాదాపుగా ఆ చీర ధర మూడు లక్షలు ఉంటుంది..రూ. 2,99,000.ఇక ఈ చీర ఖరీదు తెలిసి చాలామంది నోరెళ్లబెడుతున్నారు.. నిజంగా అంత ధర ఉంటుందా అని షాక్ అవుతున్నారు. ఏది ఏమైన కూడా ఆ చీరలో కీర్తి సురేష్ చాలా అందంగా ఉంది.. ఇక పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే పెళ్లి అనౌన్స్ మెంట్ ఇస్తుందనే వార్తలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగు, హిందీ, మలయాళం సినిమాలను చేస్తూ బిజీగా ఉంది..