ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లోకి వచ్చాక పెట్రోల్ స్కూటర్లకు ఆదరణ తగ్గుతోంది. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఈవీ వాహనాల వల్ల కలిగే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటుండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. డైలీ లైఫ్ ఉపయోగంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. తక్కువ మెయిన్ టెనెన్స్ ఖర్చులు ఈవీల వైపు మొగ్గుచూపేలా చేస్తు్న్నాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం మంచి నిర్ణయం అంటున్నారు నిపుణులు. మార్కెట్లో TVS, హీరో విడా, అథర్, ఓలాతో సహా అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నాయి. చాలా మంది ఏ స్కూటర్ కొనాలో తెలియక అయోమయానికి గురవుతుంటారు. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేటప్పుడు పలు విషయాలను గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.
Also Read:Modi – Putin: ఒకప్పుడు పుతిన్ వెనక నిలబడి, ఇప్పుడు పక్కన కూర్చుని.. మోడీ ఫోటోలు వైరల్..
డ్రైవింగ్ రేంజ్
రేంజ్ అంటే ఒక స్కూటర్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ప్రయాణించగల దూరాన్ని సూచిస్తుంది. ఇది అతి ముఖ్యమైన అంశం. బ్యాటరీ మధ్యలో అయిపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు దానిని మధ్యలో ఛార్జ్ చేయలేరు. మీరు రోజూ ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటే, ఎక్కువ రేంజ్ ఉన్న స్కూటర్ కోసం చూడండి. నేడు మార్కెట్లో చాలా స్కూటర్లు 120 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ రేంజ్‌లను అందిస్తున్నాయి.
ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, పోర్టబిలిటీ
ఎలక్ట్రిక్ స్కూటర్లు రిమూవబుల్, ఫిక్స్‌డ్ బ్యాటరీలతో వస్తాయి. మీరు రిమూవబుల్ బ్యాటరీని ఛార్జింగ్ స్టేషన్‌లో పెట్టొచ్చు. కొత్త ఛార్జ్ చేసిన బ్యాటరీని ప్లగ్ చేసి, మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. బ్యాటరీ ఛార్జ్ అయ్యే వరకు మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అయితే, ఫిక్స్‌డ్ బ్యాటరీలు ఉన్న స్కూటర్లు ఛార్జర్‌తో వస్తాయి. ఈ బ్యాటరీలు డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు వాటిని ఛార్జ్ చేయాలి. మీరు ఛార్జర్ ఉపయోగించి ఇంట్లో మీ స్కూటర్‌ను ఛార్జ్ చేయవచ్చు, కానీ మీరు వేచి ఉండాల్సి ఉంటుంది. చాలా స్కూటర్లు పూర్తిగా ఛార్జ్ చేయడానికి 7-8 గంటలు పడుతుంది. అందువల్ల, మీరు ఏ రకమైన స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవాలి.
Also Read:Ravi Shastri: కోహ్లీ, రోహిత్లను ఇబ్బంది పెట్టే వారికి రవిశాస్త్రి వార్నింగ్.. టార్గెట్ గంభీరేనా?
ఫీచర్లు, టెక్నాలజీ
మార్కెట్లో ఉన్న వివిధ స్కూటర్లను పోల్చి చూసి, ఉత్తమ ఫీచర్లను అందించేదాన్ని ఎంచుకోవాలి. లేకపోతే మీరు తర్వాత చింతించాల్సి రావచ్చు. ఎందుకంటే స్కూటర్లను పదే పదే కొనుగోలు చేయలేరు కాబట్టి. ఎలక్ట్రిక్ స్కూటర్లు అధునాతన ఫీచర్లతో వస్తాయి. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్లపై GPS నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, యాప్ ఇంటిగ్రేషన్, యాంటీ-థెఫ్ట్ అలారాలు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు వంటి స్మార్ట్ ఫీచర్లను ఉండేలా చూసుకోవాలి.
