నేడు మహాశివరాత్రి సందర్బంగా శివనామ స్మరణతో ప్రపంచం మొత్తం మారుమ్మోగిపోతుంది.. శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి.. ఒక్కొక్కరు ఒక్కోలా తమ శివ భక్తిని చాటుకుంటున్నారు.. తాజాగా కొందరు బిస్కెట్స్ తో అద్భుతాన్ని సృష్టించారు.. శివయ్య కొలువై ఉన్న కేదార్‌నాథ్ ఆలయాన్ని తయారు చేశారు.. అందుకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
సంగం నగరంలోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఆలయాన్ని నిర్మించారు.. సంగం ఒడ్డున బిస్కెట్లతో తయారు చేసిన కేదార్‌నాథ్ ఆలయ నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఆలయ నమూనాను ఐదు వేల బిస్కెట్లతో తయారు చేశారు. అలహాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని ఫైన్ ఆర్ట్స్ విభాగానికి చెందిన అజయ్ గుప్తా మరియు అతని విద్యార్థులు కొందరు కలిసి బిస్కెట్స్ తో ఈ ఆలయాన్ని నిర్మించారు..
దాదాపు నాలుగు రోజుల పాటు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించారు.. ఈ ఆలయాన్ని చూసిన వారంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు.. అలాగే ఆ ఆలయంతో సెల్ఫీలు తీసుకున్నారు.. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.. మహాశివరాత్రి సందర్బంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు వారు చెబుతున్నారు..