NTV Telugu Site icon

Bus Accident: కేదార్‌నాథ్‌ యాత్రికుల బస్సును ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరు మృతి, 15 మందికి గాయాలు

New Project (53)

New Project (53)

Bus Accident: పంజాబ్‌లోని లూథియానా సమీపంలోని సమ్రాలా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడి చహేలా గ్రామంలో ఉదయం భక్తులతో నిండిన టూరిస్ట్ బస్సు హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొనడంతో బస్సులో ఉన్న ఇద్దరు మహిళా భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మీనాక్షి (51), సరోజబాల (54)గా గుర్తించారు.

చదవండి:Medaram Priests: మేడారం పూజార్ల హెచ్చరిక.. ధర్నా చేస్తామని ప్రకటన

ఇండోర్‌లో నివసించే రిషబ్ మాట్లాడుతూ.. మేము ఇండోర్ స్థానికులమని, బస్సులో కేదార్‌నాథ్‌కు వెళ్తున్న వారంతా రైతు కుటుంబానికి చెందినవారని చెప్పారు. ప్రజలందరూ చార్ధామ్‌లో ఉన్న కేదార్‌నాథ్‌ను సందర్శించడానికి వెళ్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు మేము హరిద్వార్ నుండి అమృత్‌సర్‌కు బయలుదేరాము. ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా కలకలం రేగింది.

చదవండి:Kishan Reddy: బోనస్ ఇచ్చి కొనడానికి మీకు బాధ ఏంటి.. కిషన్ రెడ్డి ఫైర్

10రోజుల్లో ఏడు లక్షల మంది భక్తులు
దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్రకు వెళతారు. ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రకు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. గత 10 రోజుల్లో ఏడు లక్షల మందికి పైగా భక్తులు నాలుగు క్షేత్రాలను దర్శించుకున్నారు. అయితే ఈసారి ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తీర్థయాత్రకు వచ్చిన పలువురు భక్తులు దేవుడిని దర్శించుకోకుండానే తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. ఛార్ధామ్ తీర్థయాత్ర కోసం పరిపాలన తాత్కాలిక నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించింది. అయితే ఇప్పటివరకు దాదాపు నాలుగు వేల మంది భక్తులు రిషికేశ్ నుండి ఇంటికి తిరిగి వచ్చారు. ఉత్తరాఖండ్‌కు చేరుకున్నా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోలేకపోవడం దురదృష్టకరమని తిరిగి వచ్చిన యాత్రికులు తెలిపారు.