NTV Telugu Site icon

KE Prabhakar: బుగ్గనకు కేఈ సవాల్‌.. దమ్ముంటే..!

Ke Prabhakar

Ke Prabhakar

KE Prabhakar: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి సవాల్‌ విసిరారు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌.. బుగ్గనకు దమ్ముంటే బేతంచర్లలో మెజార్టీ తెచ్చుకోవాలన్నారు.. బుగ్గన సొంత వార్డులోనే టీడీపీ జెండా ఎగురవేశాం.. కేఈ, కోట్ల కుటుంబాలు గూగుల్ లో కనపడకుండా చేస్తామన్నారు మంత్రి బుగ్గన అంటున్నారు.. గూగుల్ తల్లిని సృష్టించింది మేమే అన్నారు. రాష్ట్రాన్ని వైఎస్‌ జగన్ సగం, బుగ్గన సగం నాశనం చేశారని విమర్శలు గుప్పించారు. మీరు, మీ తాత, కోట్ల, కేఈ కుటుంబాలు డోన్ ప్రజలకు ఏమి చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా..? అని ఛాలెంజ్‌ చేశారు. కోట్ల, కేఈ కుటుంబాలకు ఇల్లు లేదని విమర్శిస్తున్నావు, నీకు ఇల్లు ఉండి ఏమి చేశావు? అని ప్రశ్నించారు. నీరు – చెట్టు బిల్లులు రావాలంటే కండువా వేసుకుని 3 కోట్లు ఇవ్వాలని ఆరోపించారు.. ఫ్యాక్షన్ అనేది డోన్ నియోజకవర్గంలో ఎక్కడా లేదన్న ఆయన.. బుగ్గననే ఫ్యాక్షన్ ను మళ్లీ మొదలు పెట్టాలని చూస్తున్నాడు అని సంచలన ఆరోపణలు చేశారు కేఈ.

Read Also: Breking News: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్..

ఇక, చిన్నపూజరల్లో మావాళ్ళు మావాళ్లే గొడవ పడ్డారు.. అవతలి వాళ్లపై రాళ్లు వేయలేదు కదా..? అని ప్రశ్నించారు కేఈ ప్రభాకర్‌.. బుగ్గన రాజేంద్రప్రసాద్‌కు దీటైన వ్యక్తి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డే అన్నారు.. డోన్ ఓటర్లు చైతన్యవంతులు, కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డినే గెలిపిస్తారు అని ధీమా వ్యక్తం చేశారు కేఈ ప్రభాకర్‌.. కాగా, సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఆరోపణలు, విమర్శలు, ఛాలెంజ్‌లతో హీట్‌ పుట్టిస్తున్నారు రాజకీయ నేతలు.