మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్.. బుగ్గనకు దమ్ముంటే బేతంచర్లలో మెజార్టీ తెచ్చుకోవాలన్నారు.. బుగ్గన సొంత వార్డులోనే టీడీపీ జెండా ఎగురవేశాం.. కేఈ, కోట్ల కుటుంబాలు గూగుల్ లో కనపడకుండా చేస్తామన్నారు మంత్రి బుగ్గన అంటున్నారు.. గూగుల్ తల్లిని సృష్టించింది మేమే అన్నారు.
ఏపీలో ఎన్నికల వాతావరణం మళ్ళీ వేడెక్కింది. గతంలో ఎన్నికలు జరగని మునిసిపాలిటీల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో మునిసిపల్ ఎన్నికలకు నగారా మోగింది. తొలిసారి బేతంచర్లకు మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ప్రారంభమయింది. రెండో రోజునామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. వివిధ పార్టీల నేతలు భారీ బందోబస్తు మధ్య నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. టీడీపీ ఛైర్మెన్ అభ్యర్థిగా బి. ప్రసన్న లక్ష్మీ…