NTV Telugu Site icon

KCR: రేపు ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ విరామం.. ఎందుకో తెలుసా..?

Kcr

Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. ఆయన రేపు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొనాయపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఎందుకంటే కేసీఆర్ కు ఈ ఆలయం అంటే సెంటిమెంట్.. ఇప్పటికే సీఎం తన ఫ్యామిలీతో కలిసి రాజశ్యామల యాగం పూర్తి చేశారు. అయితే, ఈనెల 9న కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక, ఇవాళ్టి నుంచి తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని భావించిన అభ్యర్థులు ఎన్నికల అధికారుల దగ్గర నామినేషన్ పత్రాలను సమర్పించాలి.

Read Also: Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై యూఏఈ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోడీ..

అయితే, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు. ఒకే రోజు 9న రెండు నియోజకవర్గాలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అందుకే రేపు కొనాయపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు వెళ్తున్నారు. ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగాన్ని పూర్తి చేశారు. మరోవైపు, కేసీఆర్ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో గులబీ బాస్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో ఈ ఎన్నికలు ముగిసే వరకు సీఎం కేసీఆర్ షెడ్యూల్ బిజీబిజీగా ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసేలా బీఆర్ఎస్ నేతలు ప్రణాళికలు రెడీ చేశారు.