రేపు కొమురం భీం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్‌ఎస్ కార్యాలయంతో పాటు పలు అభివృద్ధి పనులను కేసీఆర్ ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ హేమంత్ బోర్కడే జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారికంగా నిర్వహించే ప్రారంభోత్సవాలు, పోడు భూముల పట్టాల పంపిణీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలపై ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఆయా శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలపై బిజీబిజీగా ఉన్నారు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
అయితే, ఆసిఫాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటనను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశంలో జన సమీకరణ, బహిరంగ సభ నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలిచ్చారు. పోడు భూముల పట్టాల పంపిణీ ఇక్కడి నుంచే లాంఛనంగా సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో సభ నిర్వహణ ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారీ వర్షం కురిసినా సీఎం పర్యటన పక్కాగా నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. హెలీక్యాప్టర్‌లో జిల్లాకు రావడానికి వాతావరణం అనుకూలించకపోతే ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలోనైనా వస్తారని ఆయన తెలిపారు.
Read Also: Team India Captain: టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున్న నేపథ్యంలో సీఎం పర్యటనను అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్‌ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. భారీ జనసమీకరణతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ట్రై చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం సభ విజయవంతం చేసేందుకు నేతలు శ్రమిస్తున్నారు. బహిరంగ సభాస్థలిలో ప్రజలు ఇబ్బంది పడకుండాకు 50 వేల మందికి సరిపడా ఉండే ప్రత్యేకమైన జర్మన్ ఆకృతి వాటర్ ప్రూఫ్ టెంట్‌ను హైదరాబాద్ నుంచి తెప్పించారు.
Read Also: Ambati Rayudu : పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధం అయిన రాయుడు..
సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు 2500 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ సురేశ్‌కుమార్ వెల్లడించారు. రేపు ముఖ్యమంత్రితో పాటు అధికారుల బందోబస్తుకు వచ్చే పోలీసు అధికారులు, సిబ్బందికి వసతి కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎం గార్డెన్స్, రోజ్‌గార్డెన్, జెడ్పీ ఉన్నత పాఠశాల, సెయింట్ మేరీ స్కూల్, ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల, పార్కింగ్ స్థలాలను ఎస్పీ సురేశ్ కుమార్ పరిశీలించారు.