Site icon NTV Telugu

Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ భౌతికకాయాన్ని చూసి బోరున విలపించిన కేసీఆర్

Kcr

Kcr

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ఉదయం కన్నుమూశారు. మాగంటి మృతితో బీఆర్ఎస్ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Also Read:Mini Countryman Electric JCW: మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 462KM రేంజ్

గోపీనాథ్‌ భౌతికకాయాన్ని మాదపూర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. కేసీఆర్ మాగంటి గోపీనాథ్ నివాసానికి చేరుకున్నారు. మాగంటి గోపీనాథ్ పార్దీవ దేహానికి పుష్పాంజలి ఘటించి బోరున విలపించారు. మాగంటి భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.

Exit mobile version