NTV Telugu Site icon

KCR Warning: కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ వార్నింగ్

Kcr

Kcr

కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు గులాబీ బాస్ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ విప్ గంప నివాసంలో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. గ్రూపు తగాదాలు వీడి కలిసి కట్టుగా పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన పార్టీ పరిణామాలపై కేసీఆర్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌పై పెరుగుతున్న నమ్మకం.. రూ.10 లక్షలు పెడితే రూ.5.49 కోట్ల రాబడి

అయితే, సీఎం కేసీఆర్ ఇప్పటికే గజ్వేల్ లో తొలి నామినేషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో కామారెడ్డిలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కామారెడ్డికి చేరుకున్న ఆయన ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఇంట్లో నియోజకవర్గ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని ఆర్వో ఆఫీసులో నామినేషన్‌ పత్రాలు అందజేస్తారు.

Read Also: Supreme Court: నేతలపై క్రిమినల్‌ కేసులను విచారించాలని హైకోర్టులకు సుప్రీం ఆదేశం

ఇక, దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నామినేషన్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత గులాబీ బాస్ నేరుగా ప్రజా ఆశీర్వాద సభకు చేరుకోనున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు. అయితే, గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సీఎం మూడో సారి పోటీ చేస్తున్నారు.