KCR: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) తెలంగాణ భవన్‌లో జరుగనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి నగరానికి బయల్దేరారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి “తాను కొడితే మామూలుగా ఉండబోదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి బీఆర్‌ఎస్ మరోసారి ముమ్మరంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Read Also: Shivaji Maharaj Jayanti: తెలుగు నేలపై నడయాడిన ఛత్రపతి శివాజీ..
ఈ నేపథ్యంలో కేసిఆర్ ఎర్రవల్లి నుంచి సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకున్నారు. పాస్ పోర్ట్ రెన్యువల్ కోసం ఆయన కార్యాలయంకు వచ్చారు. ఆయనతో ఉన్న డిప్లమాటిక్ పాస్పోర్ట్ ను సబ్మిట్ చేసి సాధారణ పాస్పోర్ట్ ను తీసుకునేందుకు సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన నందిని నివాసానికి బయలుదేరనున్నారు. అక్కడి నుండి మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్ కు ఆయన చేరుకోనున్నారు. అక్కడ పార్టీని మరింత బలోపేతం చేయడానికి, కొత్త కార్యాచరణ రూపొందించేందుకు ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది.