NTV Telugu Site icon

Kumaraswamy : అంతా అబద్ధం.. కేసీఆర్ నాకు తండ్రి లాంటి వారు

Kumaraswamy Cm Kcr

Kumaraswamy Cm Kcr

Kumaraswamy : తెలంగాణ సీఎం కేసీఆర్ తో తనకు అభిప్రాయ బేధాలు లేవని.. తన తండ్రి తర్వాత అంతటి వారు కేసీఆర్ అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు. కేసీఆర్ ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కుమారస్వామి హాజరుకాకపోవడం అందరిలో అనేక అనుమానాలను తావిచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తాజాగా కుమారస్వామి స్పందిస్తూ ఊహాగానాలను కొట్టిపారేశారు. తన తండ్రి దేవెగౌడ తర్వాత తనకు అంతటి మార్గదర్శి కేసీఆరేనని చెప్పారు. కర్ణాటక రాయచూర్ లో జరిగిన పంచరత్న యాత్రలో నారాయణపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి కుమారస్వామి పాల్గొన్నారు.

Read Also: Telangana Budget : నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనున్న గవర్నర్

ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అధికారం లభిస్తే కేసీఆర్‌ స్ఫూర్తితో కర్ణాటకను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కేసీఆర్‎తో కలలో కూడా విభేదాలు తలెత్తవని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో తండ్రి దేవేగౌడ తర్వాత తనకు అంతటి మార్గదర్శి కేసీఆరేనని స్పష్టంచేశారు. కేసీఆర్‌ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 24 జిల్లాల రైతులకు ఎంతో మేలు జరుగుతున్నదని, మిషన్‌ భగీరథ పథకం వల్ల ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నదని తెలిపారు. సాగు, తాగు నీటి పథకాలను విజయవంతంగా అమలు చేయటంలో కేసీఆర్‌ అంకిత భావం, దృఢ సంకల్పం తనను ఎంతగానో ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరం స్ఫూర్తితో ఐదేండ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలనలో కర్ణాటక తిరోగమనంలోకి మళ్లిందని విమర్శించారు.

Read Also: Chiranjeevi : కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి