NTV Telugu Site icon

KCR : రైతు బంధు రాలేదు రుణ మాఫీ రాలేదు

Kcr

Kcr

కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ గా చెబుతున్నారు కొత్తగూడెం జిల్లా తీస్సివేయాలని అంటున్నారని, కొత్తగూడెం జిల్లా వుండాలంటే బీఆర్‌ఎస్‌ గెలవాలన్నారు. కాంగ్రెస్‌కు సురుకు పెట్టాలన్నారు. అడ్డగోలుగా వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ అని కేసీఆర్‌ మండిపడ్డారు. ఈ రోజు కరెంట్ రావడం లేదని, రెప్ప పాటు పోకుండా నేను ఇచ్చాననన్నారు. దొంగతోపు గ్రామానికి కరెంట్ మా హాయం లో ఇచ్చానని, కొత్తగూడెం జిల్లాలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయంలో అతి ఎక్కువ పోడు పట్టాలు ఇచ్చామని, యుద్ధం పోరాటం చేయడానికి మీరంతా సిద్ధంగా వుండాలన్నారు. గిరిజనుల కోసం బంజారా హిల్స్ లో కోట్ల రూపాయల తో బంజారా భవన్ కట్టించామన్నారు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తీసుకోవాలని నరేంద్ర మోడీ వత్తిడి తెస్తే నేను ఒప్పుకోలేదని, రైతు బంధు రాలేదు రుణ మాఫీ రాలేదన్నారు. జిల్లాను తీసివేస్తమని అంటున్నారని, మోడీ బీజేపీ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చ లేదన్నారు.

 

నరేంద్ర మోడీ అంత దరిద్ర మైన పాలన చూడలేదని, గోదావరి ఎత్తుకుని పోయి తమిళనాడు, కర్ణాటక కు ఇస్తానని అంటున్నారన్నారు. ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట కడితే తమిళనాడు, కర్ణాటక కు నీళ్లు తరలించుకుని పోతే, మన పరిస్థితి అద్వాన్నం అవుతుందన్నారు. గోదావరి తరళించుకుని పోతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని, కాంగ్రెస్, బీజేపీ లకు ఓటు వేస్తే ఖచ్చితంగా మళ్ళీ మీటర్లు పెడుతారన్నారు. తెలంగాణ కోసం. పేగులు తెగే వరకు పోరాడే వాళ్ళే గెలువాలన్నారు. ఫ్రీ బస్ వల్ల ఆటో కార్మికుల భవిష్యత్ ఆందోళన కరంగా తయారు అయ్యిందన్నారు. గురుకులంలో ఆహారం కలుషితం అవుతుందన్నారు.