Site icon NTV Telugu

KCR: తొలి ట్వీట్ చేసిన కేసీఆర్..

Kcr

Kcr

శనివారంనాడు కేసీఆర్ సోష‌ల్ మీడియాలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. @KCRBRSpresident పేరుతో కేసీఆర్ తన ‘ X ‘ ఖాతాను తెరిచారు. దీనితోపాటు.. కేసీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా కూడా తెరిచారు. ఖాతా ఓపెన్ చేసిన కేవలం గంటల వ్యవధిలోనే వేల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నుండి కేసీఆర్ ఎక్స్ వేదికగా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు.

Also Read: Gold Medals: వ‌ర‌ల్డ్ ఆర్చ‌రీలో హ్యాట్రిక్ గోల్డ్ మెడ‌ల్స్ సాధించిన విజ‌య‌వాడ‌ ఆర్చర్ జ్యోతి సురేఖ‌..

ఈ తొలి ట్వీట్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ‘బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ తెలిపారు. ఈ ట్వీట్‌ కు తెలంగాణ ఉద్య‌మ కాలం నాటి త‌న ఫొటోను కేసీఆర్ జ‌త పరిచారు.

Also Read: Sundar Pichai: ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన గూగుల్‌ సీఈఓ.. 20 ఏళ్ల బంధం అంటూ..

ఈ ట్వీట్ తర్వాత.. బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలను తెలుపుతూ.. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం అంటూ కేసీఆర్ రెండో ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎవరికైనా సోషల్ మీడియాలో ఖాతా లేని వారు ఉంటే వెంటనే కొత్త ఖాతాలను తెరవాలని ఆయన సూచించారు. ప్రజలకు చేరువయ్యేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Exit mobile version