Parliament Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన గులాబీ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని రెడీ అయింది. ఈ క్రమంలోనే స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఈ సారి ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా గెలుపు గుర్రాలనే ఎన్నికల బరిలోకి దింపాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థులకు ముందుగానే సమాచారం ఇచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Pawan Singh: సమయమే సమాధానం చెబుతుంది.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై వ్యాఖ్యలు
ఇక, ఇవాళ గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ వరుసగా రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ సెగ్మెంట్ల నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా నామా నాగేశ్వర రావు పేరుని ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర రావును తొలి లోక్‌సభ అభ్యర్థిగా కేసీఆర్ అనౌన్స్ చేయగా.. మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత మరోసారి పోటీ చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, కాంగ్రెస్ మీద వ్యతిరేకత మొదలైంది కాబట్టి.. మనకే గెలిచే అవకాశాలు ఉన్నాయని క్యాడర్ కు కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తుంది.