Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Press Note Kbk Groups Chairman Kakkireni Bharath Kumar Success Story

KBK Business Solutions: యువతకు ఆదర్శంగా యువ ఎంటర్‌ప్రెన్యూర్.. కక్కిరేణి భరత్ కుమార్ !

Published Date :April 9, 2025 , 10:57 am
By Chandra Shekhar Pamena
  • కేబీకే గ్రూప్ చైర్మన్ సక్సెస్ స్టోరీ..
  • విభిన్న రంగాల్లో కంపెనీలతో వందల మందకి ఉపాధి..
  • అమెరికాలోనూ తెలుగు వారికి ఉపాధి అవకాశాలు
KBK Business Solutions: యువతకు ఆదర్శంగా యువ ఎంటర్‌ప్రెన్యూర్.. కక్కిరేణి భరత్ కుమార్ !
  • Follow Us :
  • google news
  • dailyhunt

మీరు చేయగలిగిన అత్యుత్తమ పెట్టుబడి మీలోనే ఉంది.. మీరు కేవలం ఒక ఉద్యోగాన్ని వెతుక్కోకండి.. మీరే ఓ మార్గాన్ని సృష్టించండి.. తద్వారా ఇతరులకు అవకాశాలను కల్పించండి-వారెన్ బఫెట్.. 

ఇదొక పోటీ ప్రపంచం. ఈ ఆధునిక సాంకేతిక యుగంలో టెక్నాలజీ రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకొక కొత్త అప్లికేషన్ పుట్టుకొస్తోంది. ఆ టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త మెళకువలతో ఉద్యోగం సాధించడం, దాన్ని నిలబెట్టుకోవడం కత్తిమీద సాములాంటిది. ఉద్యోగం సాధించడానికే అంత శ్రమ పడాల్సి వస్తే మరి ఉద్యోగాలు సృష్టించడం అనేది ఒక యుద్ధం లాంటింది. ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ చెప్పిన సూక్తి ఆధారంగా డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం వెతుక్కోకుండా తన మేధస్సునే పెట్టుబడిగా పెట్టి ఉద్యోగాలు సృష్టించాలనే సంకల్పంతో కేవలం 20 ఏళ్ల వయసులోనే కంపెనీ స్థాపించారు కేబీకే గ్రూప్ చైర్మన్ డా. కక్కిరేణి భరత్ కుమార్. కేవలం 15 ఏళ్లలోనే పదుల సంఖ్యలతో కంపెనీలు స్థాపించి వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ సక్సెస్ స్టోరీ ఇదీ.

గ్యాడ్యుయేషన్ సమయంలోనే..
తెలంగాణలోని నల్లగొండ పట్టణానికి చెందిన యువ ఎంటర్‌ప్రెన్యూర్ డా.భరత్ కుమార్ హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మొదటి నుంచి ఉద్యోగం కంటే వ్యాపారం పైనే దృష్టి ఉన్న ఆయన గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరంలోనే కేబీకే బిజినెస్ సొల్యూషన్స్ పేరుతో చిన్న ఐటీ కంపెనీ స్థాపించారు. డిగ్రీ పూర్తవగానే అమెరికా వెళ్లి ఎంఎస్ చేశారు.

కేబీకే గ్రూప్ గా అవతరించి..
అమెరికాలో ఎంఎస్ విద్యనభ్యసిస్తున్న సమయంలోనే ఇండియాలో కేబీకే బిజినెస్ సొల్యూషన్స్ ను మరింత విస్తరించారు. 15 ఏళ్లలో డిజిటల్ మార్కెటింగ్, ఐటీ, రియల్ ఎస్టేట్, డిజిటల్ మీడియా తదితర రంగాల్లో కంపెనీలు స్థాపించి కేబీకే గ్రూప్ గా తీర్చిదిద్దారు. తద్వారా నేడు కొన్ని వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సక్సెస్ ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా నిలిచారు.

అమెరికాలో భారతీయ విద్యార్థులకు సాయం..
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు ముఖ్యంగా తెలుగు వారికి భరత్ కుమార్ తన వంతుగా సాయం చేస్తున్నారు. ఆయన స్థాపించిన ఐటీ కంపెనీల్లో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారికి మార్గనిర్దేశకులుగా నిలుస్తున్నారు. టెక్సాస్‌లోని ఆస్టిన్, డల్లాస్ నగరాల్లో ఈక్వినాక్స్ ఐటీ సొల్యూషన్స్, బోన్సాయ్ సొల్యూషన్స్ ద్వారా ద్వారా వందలాది మంది భారతీయ విద్యార్థులకు ఉన్నత ఉద్యోగాలు రావడంలో తన వంతు సాయం అందిస్తున్నారు భరత్ కుమార్.

డిజిటల్ మార్కెటింగ్ సేవలతో..
ప్రస్తుత ఉన్నది డిజిటల్ యుగం. ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఏ వ్యాపారం అయినా త్వరితగతిన వృద్ధి చెందాలంటే మార్కెటింగ్ సేవలు అవసరం. ఒక కంపెనీ ద్వారా అందించే సేవలైనా, ఉత్పత్తులైనా వినియోగదారులకు చేరాలంటే డిజిటల్ మార్కెటింగ్ తో నే సాధ్యం. కేబీకే బిజినెస్ సొల్యూషన్స్ ద్వారా ఐటీ, డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందిస్తున్నారు భరత్ కుమార్. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త మెళకువలతో పలు కంపెనీలకు వెబ్ సైట్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసులు అందిస్తున్నారు. కేబీకే బ్రాడ్ కాస్టింగ్స్ ద్వారా డిజిటల్ యాడ్స్, ప్రమోషన్ వీడియోలు రూపొందిస్తున్నారు. కేబీకే ప్రొడక్షన్స్ ద్వారా షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ సినిమాల పట్ల ఆసక్తి ఉన్న ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహిస్తున్నారు. కేబీకే రియల్టర్స్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించారు.

కేబీకే హాస్పిటల్స్ తో ఆరోగ్య రంగంలోకి..
ప్రస్తుతం యాంత్రిక జీవితంలో పని ఒత్తిడి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోజు రోజుకి మరింత విస్తరిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎదుర్కొంటున్న డయాబెటిస్ ఫుట్ అల్సర్స్ కు కేబీకే హాస్పిటల్ ద్వారా అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు. గ్యాంగ్రీన్, సెల్యూలైటిస్ తదితర వ్యాధులకు ఆంప్యుటేషన్ రహిత వైద్య విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇలా తను అడుగుపెట్టిన ప్రతి రంగంలో అభివృద్ది సాధిస్తూ, తన ప్రయాణంలో పరిచయమైన వారికి ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నారు. టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త ఉపాధి మార్గాలను అన్వేషిస్తూ, ఉద్యోగాలను సృష్టిస్తూ యువ పారిశ్రామికవేత్తలకు ఒక మార్గదర్శిగా నిలుస్తున్నారు.

నిరుపేదల చదువుకు ఆర్థిక భరోసా..
కేబీకే గ్రూప్ వివిధ రంగాల్లో సర్వీసులు అందిస్తున్న భరత్ కుమార్ సామాజిక సేవలోనూ ముందున్నారు. దైవం మానుష రూపేణా అనే నానుడిని నిజం చేస్తూ అనాథల, అన్నార్థుల ఆకలి తీరుస్తున్నారు. కేబీకే వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రతి నెలా పలు అనాథ ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ఏటా చదువులో రాణించే నిరుపేద అమ్మాయిల ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయం అందిస్తున్నారు.

అరుదైన గౌరవాలు..
విభిన్న రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా భరత్ కుమార్ పలు అరుదైన అవార్డులు, గౌరవాలు అందుకున్నారు. వందే భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేత సంజీవ రత్న పురస్కార్, రాష్ట్రీయ గౌరవ్ పురస్కార్ అవార్డులు వరించాయి. వ్యాపారాల్లో విజయవంతమైన నాయకత్వానికి గుర్తింపుగా ప్రముఖ మ్యాగజీన్ ఫోర్బ్స్ బిజినెస్ కౌన్సిల్ 2024 జాబితాలో నిలిచారు.

అమెరికాలో భారీ ఆధ్యాత్మిక కేంద్రం.. హరిహర క్షేత్రం
వ్యాపారం నిమిత్తం అమెరికాలో స్థిరపడిన భరత్ కుమార్ తన మూలాలను మాత్రం మరవలేదు. తన ఆధ్యాత్మిక చింతనను కొనసాగిస్తూ సనాతన భారతీయ సంప్రదాయాలను పరిరక్షించే గొప్ప సంకల్పంతో అమెరికాలో ఓ భారీ ఆధ్యాత్మిక కేంద్రం నెలకొల్పుతున్నారు. టెక్సాస్ లోని ఆస్టిన్ నగరంలో హరిహర క్షేత్రం పేరుతో ఓ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. జార్జ్ టౌన్ ప్రాంతంలోని 375 కింగ్ రియాలో శ్రీ వేంకటేశ్వర స్వామి, శివాలయాలతోపాటు గణపతి, అయ్యప్ప స్వామి, దుర్గ, సరస్వతి ఆలయాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆలయంలో నిత్య పూజలు, పండుగ సందర్భాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bharath Kumar Kakkireni
  • businesses
  • KBK Group Chairman
  • KBK Groups
  • telangana

తాజావార్తలు

  • Banana Health Benefits: కెమికల్స్ తో పండించిన అరటిపండ్లను తింటున్నారా? FSSAI మార్గదర్శకాలతో నిమిషాల్లో గుర్తించొచ్చు!

  • CSK vs DC controversy: 19వ ఓవర్‌లో ఉద్రిక్తత.. ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి వెనుక పెద్ద వివాదం.. అసలేం జరిగిందంటే?

  • Jagtial: భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తపై అల్లుడు దారుణం..

  • Priyanka Arul Mohan: నటిగా ఆ సినిమాతోనే నన్ను నేను తెలుసుకున్నా..

  • KrithiShetty : బేబీ ఖాతాలో మరో ప్లాప్.. స్టార్ డైరెక్టర్ యూ టర్న్ తీసుకుంటాడా?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions