Kayadu Lohar: సౌత్‌ ఇండస్ట్రీని ఏలేస్తున్న అస్సాం బ్యూటీ.. సినిమా లైనప్ మాములుగా లేదుగా!

Kayadu Lohar

Kayadu Lohar

Kayadu Lohar: మోడల్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన అస్సాం బ్యూటీ నాలుగేళ్లు తిరగకుండా సౌత్‌ ఇండస్ట్రీని ఏలేస్తోంది. కన్నడ తప్ప సౌత్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌ అన్నింటిలోనూ బిజీగానే ఉంది ఈ భామ. వరుసగా 8 సినిమాలు చేస్తున్న ఆ అమ్మడు ఎవరో చూసేద్దామా..

India Post GDS Recruitment 2026: పోస్టల్ శాఖలో 28740 పోస్టులు.. 40 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు.. పరీక్ష లేదు

డ్రాగన్‌ రిలీజ్‌ తర్వాత ‘కాయాదు లోహర్‌’ తన కాల్షీట్స్‌ ఇవ్వడానికి కసరత్తులే చేసింది. స్టార్‌ హీరోలు ఛాన్సులు ఇచ్చినా.. కాల్షీట్స్‌ వెతుక్కోవాల్సిన పరిస్థితిలో పడిపోయింది. క్రేజీ హీరోయిన్స్‌.. మూడు నాలుగు సినిమాలు చేస్తుంటే.. కాయాదు ప్రస్తుతం ఏకంగా 8 మూవీస్‌ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ఒక్క సినిమా తల రాతను మార్చేస్తుందనడానికి కాయాదు లోహర్‌ బెస్ట్ ఎగ్జాంపుల్‌. నాలుగేళ్లపాటు నాలుగు సినిమాలు చేసినా రాని గుర్తింపును డ్రాగన్‌ తీసుకొచ్చింది.. దీనితో క్రేజీ హీరోయిన్‌ అయిపోయింది.

ప్రదీప్‌ రంగనాథ్‌, కాయాదు జంటగా నటించిన తమిళ చిత్రం డ్రాగన్‌ తమిళంలోనే కాదు.. తెలుగులో ఘన విజయం సాధించింది. తెలుగు రైట్స్‌ను 3 కోట్లకు అమ్మితే.. 10 కోట్లు వచ్చింది. తెలుగులో అల్లూరి మూవీలో శ్రీవిష్ణుతో జత కట్టినా సినిమా ఫ్లాప్‌ కావడంతో, మరో ఛాన్స్‌ దక్కలేదు. డ్రాగన్‌ హిట్‌ తర్వాత తెలుగులో బిజీ అయిపోతోంది కాయాదు. ‘ఫంకీ’ మూవీలో విశ్వక్‌ సేన్‌ హీరోయిన్‌ గా సెలెక్ట్‌ అయింది. నాని పాన్‌ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్‌’లో ఛాన్స్‌ కొట్టేసింది.

32GB ఇంటర్నల్ స్టోరేజ్, డాల్బీ ఆడియో, QLED 55 అంగుళాల డిస్‌ప్లే.. Xiaomi FX Pro QLED Ultra HD 4K టీవీపై రూ.30,000 భారీ డిస్కౌంట్!

25 ఏళ్ల కాయాదు సినిమా ఎంట్రీ 21 ఏళ్లకే ‘కన్నడ మూవీ ‘ముగిల్‌పేటే’తో మొదలైంది. ఆతర్వాత మలయాళం, తెలుగు, మరాఠి మూవీస్‌ చేసినా రాని గుర్తింపు తమిళ డెబ్యూ డ్రాగన్‌ తీసుకొచ్చింది. ఈ అమ్మడి కెరీర్‌ను మార్చేసి క్రేజీ హీరోయిన్ని చేసేసింది. ప్రస్తుతం తమిళంలో 3, మలయాళంలో 3, తెలుగులో 2 ఇలా మొత్తం 8 సినిమాలు వరుస పెట్టి చేస్తోంది. మరి స్టార్‌ హీరోలు పిలిచి ఛాన్స్‌ ఎప్పుడిస్తారో చూడాలి మరి.