Site icon NTV Telugu

MLC Kavitha: గాయకులతో కలిసి బతుకమ్మ పాటను పాడిన కవిత

Kavitha

Kavitha

బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి సన్నాహాలు మొదలు పెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన ఒక వీడియోను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్యతో పాటు భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ గుడారి శ్రీనుతో కలిసి కవిత పాట పాడడం వీడియోలో కనిపించింది.

Read Also: Minister Gudivada Amarnath: పవన్‌పై మంత్రి ఘాటు వ్యాఖ్యలు.. వెంట్రుక కూడా పీకలేకపోయారు..!

తెలంగాణ జాగృతి యాప్ లో ఇప్పటికే దాదాపు 150 బతుకమ్మ పాటలు ఉన్నాయి. ప్రజల సహకారంతో అరుదైన, ప్రాచీన, కొత్తగా పూర్తి చేసిన బతుకమ్మ పాటలను సేకరిస్తోంది. అలాంటి పాటలను జాగృతితో పంచుకోవడం కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ కూడా కేటాయించింది. +91 8985699999 నెంబర్ కి వాట్సాప్ ద్వారా ఆ పాటలను పంపించాలని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.

Read Also: TS Govt: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. లక్ష లోపు రైతు రుణాలన్నీ మాఫీ

అంతేకాక తమకు ఇష్టమైన బతుకమ్మ పాటలను సామాజిక మాధ్యమాల్లో భారత్ జాగృతికి ట్యాగ్ చేస్తూ పోస్టులు చేయాలని, తెలంగాణ జాగృతి ఆప్ ద్వారా షేర్ చేయాలని కవిత పిలుపునిచ్చారు. బతుకమ్మ పాటలు సేకరణ, రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించిన భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కొడారి శ్రీనును కల్వకుంట్ల కవిత అభినందించారు.

Exit mobile version