Site icon NTV Telugu

MLC Kavitha : భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై కౌంటర్ దాడులకు దిగింది. అనంతరం పాకిస్తాన్ ప్రత్యక్షంగా భారత్‌పై దాడికి దిగడంతో, ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ ఉద్రిక్త వాతావరణాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం వల్ల కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా సాంత్వనకు తీసుకువచ్చారు. ప్రస్తుతం రెండు దేశాల సరిహద్దుల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ, “రాష్ట్ర రక్షణలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. దేశాన్ని ధైర్యంగా కాపాడిన సాయుధ దళాలకు అభినందనలు తెలియజేస్తున్నాను” అన్నారు.

MLC Kavitha : భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

అయితే ఈ కాల్పుల విరమణ ఫలితంగా భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి నెలకొంటే, అందరికీ మంచిదే అని అభిప్రాయపడిన ఆమె, “ఇది అమెరికా జోక్యం వల్ల సాధించబడినదైతే, భారత్ అత్యంత జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఈ పరిస్థితులన్నింటిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి” అని కవిత కోరారు. కవితతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఈ అంశంపై పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Sudheer Babu : వైలేన్స్ కాన్సెప్ట్‌తో సుధీర్ బాబు ..

Exit mobile version