NTV Telugu Site icon

MLC Kavitha : ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటాం

Kavitha

Kavitha

MLC Kavitha : బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంతమంది ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు సమాచారం ఉందని ఆమె చెప్పారు. “ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటాం,” అంటూ హెచ్చరించారు. బెదిరింపులకు పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదని, పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వారిని క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

కవిత, కాంగ్రెస్ నాయకులపై కూడా విమర్శల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే అధికారులను, నాయకులను ఉపేక్షించమని స్పష్టం చేశారు. “వాళ్ల తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా భయపడేది లేరు ఇక్కడ,” అని కవిత ఘాటు వ్యాఖ్య చేశారు. “మాట తప్పడమే, మడమ తిప్పడమే కాంగ్రెస్ నైజం” అంటూ ఆమె విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారెంటీ కార్డులను ఇంటింటికీ పంచి ఓట్లు సాధించారని, కానీ ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.

“గతంలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి పదేళ్ల పాటు అరిగోస పెట్టింది కాంగ్రెస్ పార్టీ. వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలకు కారణం అదే పార్టీ,” అని కవిత విమర్శించారు. “ఏడాదిన్నర పాలనలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి,” అంటూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చివరిగా, “ప్రతి ఇంటి నుంచి ఒక్కరు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తప్పకుండా రావాలి,” అని పిలుపునిచ్చారు.

Redmi A5 4G: రెడ్‌మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ విడుదల.. వావ్ అనిపించే ఫీచర్స్