MLC Kavitha : తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏర్పడినా.. సామాజికంగా సమానత్వం ఇంకా రాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. గురువారం మే డే సందర్భంగా ఆమె నివాసంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు కింద భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందుతోందని, కానీ భూమిలేని కార్మికుల విషయానికి వస్తే ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆమె స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ.8 లక్షలు అయితే, అందుకు పక్కనే ఉన్న వికారాబాద్‌లో అది కేవలం రూ.1.58 లక్షలు మాత్రమే. ఇది తీవ్రమైన సామాజిక వ్యత్యాసానికి నిదర్శనమని ఆమె అన్నారు.
CM Revanth Reddy : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?
ఈ నేపథ్యంలో అసమానతలు తొలగించేందుకు సమాజం మరో ఉద్యమం దిశగా సాగాలని ఆమె పిలుపునిచ్చారు. రేపటి తెలంగాణలో ఎవరికైనా – భూమి ఉన్నా లేకున్నా, రైతైనా కార్మికుడైనా – ప్రభుత్వం భరోసాగా నిలవాలని ఆకాంక్షించారు. అందుకే మే డే స్ఫూర్తిని పునఃస్మరించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కార్మికుల హక్కుల కోసం మే 20న దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెకు ‘జాగృతి’ పూర్తిగా మద్దతుగా ఉంటుందని ఆమె తెలిపారు. తెలంగాణ ఉద్యమం దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని, అలాగే సామాజిక సమానత్వం కోసం కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలన్నారు.
PM Modi Amravati Tour: ప్రధాని మోడీ అమరావతి పర్యటన.. వాహనదారులకు అలర్ట్..
