NTV Telugu Site icon

Excise Policy Case: కేజ్రీవాల్‌పై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కవిత పాత్ర ప్రస్తావన

Kavitha

Kavitha

Excise Policy Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కవిత పాత్రను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది. 100 కోట్ల రూపాయల నగదు లిక్కర్‌ స్కాం ద్వారా చేతులు మారినట్లు ఈడీ పేర్కొంది. ఆప్ ఇచ్చిన నగదు మొత్తాన్ని గోవా ఎన్నికల కోసం ఖర్చుపెట్టినట్లు వెల్లడించింది. కవిత మాజీ పీఏ అశోక్ కౌశిక్ చేతుల మీదుగా లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. కవిత దగ్గర్నుంచి రెండు బైకులు, నగదు తీసుకెళ్ళి దినేష్ అరోరాకు అప్పగించినట్లుగా చెప్పారు. ఢిల్లీలోని వినోద్ చౌహన్ దగ్గర అశోక్, దినేష్ అరారోలు కలుసుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. గోవా ఎన్నికల సందర్భంగా వినోద్ చౌహన్ డబ్బుల పంపిణీ చేశాడని, ముత్తా గౌతమ్ సంబంధించిన మీడియా సంస్థ ద్వారా హవాలా లావాదేవీలు జరిగాయని చెప్పింది. అభిషేక్ బోయినపల్లి, ముత్తా గౌతమ్‌లు కలిసి ఏడు కోట్ల రూపాయలను హవాలా ద్వారా అరవింద్ సింగ్‌కు ఇచ్చారని ఈడీ అధికారులు తెలిపారు.

Read Also: Telangana DGP: తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ నియామకం

 

 

Show comments