NTV Telugu Site icon

Advocate Mohit Rao: ఈడీ కేసుపై కవిత న్యాయవాది కీలక వ్యాఖ్యలు..

Mohit Rao

Mohit Rao

ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్‌ మంజూరు చేసింది ధర్మాసనం. పలు షరతులతో కూడిన బెయిల్‌ ను మంజూరు చేసింది. కాగా.. ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత కవిత జైలు నుంచి బయటికి రానున్నారు. ఈరోజు రాత్రికి కవిత, కేటీఆర్, హరీష్ రావు.. ఇతర బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు కవిత, కేటీఆర్, హరీష్ రావు.. ఇతర బీఆర్ఎస్ నేతలు హైదరాబాదుకు రానున్నారు.

Read Also: Kolkata Doctor Murder: పోలీసులు విద్యార్థులను ఉరికించి కొడుతున్నారు.. కొందరి పరిస్థితి విషయం!.. (వీడియో)

ఇదిలా ఉంటే.. కవితపై ఈడీ కేసుపై కవిత న్యాయవాది మోహిత్ రావు మాట్లాడుతూ, ఈడీది పూర్తిగా అసంబద్ధ దర్యాప్తు అని ఆరోపించారు. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో అరెస్టు అయిన తర్వాత ఇచ్చిన వాటిని మాత్రమే దర్యాప్తు సంస్థ పరిగణలోకి తీసుకుందని తెలిపారు. కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన వారు కేసులో నిందితులుగా కూడా లేరని అన్నారు. సెక్షన్ 45 ప్రకారం మహిళకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు. విద్యాధికురాలు, ఎంపీ, ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఆమె మహిళ కాకుండా పోరు అని సుప్రీంకోర్టు పేర్కొందని ఆయన అన్నారు. తాను మొదటినుంచి అరెస్టు అక్రమం అని చెబుతూ వచ్చానని.. ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అది నిరూపితమైందని పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ అసంబద్ధంగా దర్యాప్తు చేస్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని చెప్పారు. ట్రయల్ కోర్టులో బెయిల్ బాండ్స్ సమర్పించాల్సి ఉంటుందని.. అనంతరం జైలు నుంచి కవిత విడుదల అవుతారని న్యాయవాది మోహిత్ రావు తెలిపారు. ఇవాళ జైలు నుంచి విడుదల అవుతారని న్యాయవాది చెప్పారు.

Read Also: AMMA: పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్..రాజీనామాపై మోహన్‌లాల్ ఎమోషనల్!