Advocate Mohit Rao: ఈడీ కేసుపై కవిత న్యాయవాది కీలక వ్యాఖ్యలు..
- ఈడీది పూర్తిగా అసంబద్ధ దర్యాప్తు- కవిత న్యాయవాది మోహిత్ రావు
- సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో అరెస్టు అయిన తర్వాత..
- ఇచ్చిన వాటిని మాత్రమే దర్యాప్తు సంస్థ పరిగణలోకి తీసుకుంది- న్యాయవాది
- కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చినవారు కేసులో నిందితులుగా కూడా లేరు
- సెక్షన్ 45 ప్రకారం మహిళకు బెయిల్ పొందే అర్హత ఉంది- మోహిత్ రావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. పలు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. కాగా.. ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత కవిత జైలు నుంచి బయటికి రానున్నారు. ఈరోజు రాత్రికి కవిత, కేటీఆర్, హరీష్ రావు.. ఇతర బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు కవిత, కేటీఆర్, హరీష్ రావు.. ఇతర బీఆర్ఎస్ నేతలు హైదరాబాదుకు రానున్నారు.
Also Read
- Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
- Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
ఇదిలా ఉంటే.. కవితపై ఈడీ కేసుపై కవిత న్యాయవాది మోహిత్ రావు మాట్లాడుతూ, ఈడీది పూర్తిగా అసంబద్ధ దర్యాప్తు అని ఆరోపించారు. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో అరెస్టు అయిన తర్వాత ఇచ్చిన వాటిని మాత్రమే దర్యాప్తు సంస్థ పరిగణలోకి తీసుకుందని తెలిపారు. కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన వారు కేసులో నిందితులుగా కూడా లేరని అన్నారు. సెక్షన్ 45 ప్రకారం మహిళకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు. విద్యాధికురాలు, ఎంపీ, ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఆమె మహిళ కాకుండా పోరు అని సుప్రీంకోర్టు పేర్కొందని ఆయన అన్నారు. తాను మొదటినుంచి అరెస్టు అక్రమం అని చెబుతూ వచ్చానని.. ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అది నిరూపితమైందని పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ అసంబద్ధంగా దర్యాప్తు చేస్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని చెప్పారు. ట్రయల్ కోర్టులో బెయిల్ బాండ్స్ సమర్పించాల్సి ఉంటుందని.. అనంతరం జైలు నుంచి కవిత విడుదల అవుతారని న్యాయవాది మోహిత్ రావు తెలిపారు. ఇవాళ జైలు నుంచి విడుదల అవుతారని న్యాయవాది చెప్పారు.
Read Also: AMMA: పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్..రాజీనామాపై మోహన్‌లాల్ ఎమోషనల్!
తాజావార్తలు
-
Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
-
TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ కీలక చర్య
-
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
-
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!