Site icon NTV Telugu

Delhi Liquor Scam Case: నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కవిత ఛార్జిషీట్ పై విచారణ

Mlc Kavitha

Mlc Kavitha

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టై జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం రౌస్‌ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై ఇప్పటికే ఆమె తిహార్‌ జైల్లో ఉంటున్న విషయం విదితమే. కాగా, ఆమె జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగించాలా లేదా అనే అంశంపై మంగళవారం రౌజ్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ మద్యం పాలసీలో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్‌ దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకోవాలని ఈడీ తరఫు న్యాయవాది కోర్టును కోరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈడీ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది.

READ MORE: Cyber Crime : మీ సిమ్ తో ఫ్రాడ్ జరుగుతోంది.. అధికారి నటిస్తూ మహిళకు రూ.30లక్షలు టోకరా

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టివేసింది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒక్కరని ఒకరని ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరపు లాయర్లు కోర్టును కోరారు. అలాగే, మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్-45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ, దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఈ కేసులో ఆమె కీలక పాత్ర అని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్‌ను తిరస్కరించింది.

Exit mobile version