కన్నడ భామ అయిన కౌశల్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె 1996 లో సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయింది.. ఆమె జగపతిబాబు హీరో గా నటించిన అల్లుడుగారు వచ్చారు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తరువాత శ్రీకాంత్ సరసన పంచదార చిలక సినిమా లో నటించింది.ఈ రెండు ఆశించిన స్థాయి లో విజయం సాధించలేదు. టాలీవుడ్ కి దూరమైంది. తమిళ్, మలయాళ సినిమాలలో అద్భుతంగా రానించింది. ఆ తరువాత కౌశల్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్ళీ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది. గౌరీ మూవీ లో ఈ భామ నరేష్ భార్య పాత్ర లో నటించింది.ఆ తరువాత నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంట గా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమా లో రకుల్ తల్లి పాత్ర లో నటించింది.
అయితే 43 ఏళ్ళు వచ్చిన కౌశల్య వివాహం చేసుకోలేదు..ఇంత వయస్సు వచ్చిన తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఆమె స్వయంగా కారణం తెలిపింది.. ”వివాహ వ్యవస్థకు నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. సరైన వ్యక్తి భర్త గా వస్తే జీవితం ఎంతో అందంగా, ఆనందంగా ఉంటుంది. నాకు తగినవాడు దొరకడేమో అని ఎంతో భయపడ్డాను.. ఎందుకో ఆ రిలేషన్ నాకు అస్సలు సెట్ కాదనిపించింది. అందుకే తల్లిదండ్రులతో నే నేను ఉండిపోయాను.తల్లిదండ్రుల తో ఉంటున్నప్పుడు కూడా నాకు పెళ్లి ఆలోచన వచ్చింది. అయితే అత్తమామలతో నేను సరిగ్గా ఉండగలనా లేదో అనే సందేహం కూడా కలిగింది. ఇలా అనేక ఆలోచనలు నన్ను పెళ్లి అంటే భయానికి గురి చేశాయి. దానికి తోడు నేను అనారోగ్యానికి గురయ్యాను. బాగా బరువు పెరిగాను. నటించిన సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేదు.. దీంతో అన్ని విషయాల నుండి నేను బ్రేక్ తీసుకున్నాను.. అని ఆమె వెల్లడించింది. ఇక కౌశల్య మాటలను బట్టి ఆమెకు ఇక పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తెలుస్తుంది.