NTV Telugu Site icon

Katrina Kaif : పిల్లలు పుట్టాలని స్టార్ హీరోయిన్ ప్రత్యేక పూజలు

Katrina Kaif

Katrina Kaif

Katrina Kaif : సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే సినిమాల్లో నటించడం ఆపేస్తారు. కానీ బాలీవుడ్ భామలు మాత్రం పెళ్లి అయి పిల్లలు పుట్టినా సినిమాల్లో నటించడం ఆపట్లేదు. కత్రినా కైఫ్ 20 ఏళ్లకు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. విక్కీ కౌశల్ తో పెళ్లి అయి నాలుగేళ్లు అవుతున్నా.. సినిమాలకు పులిస్టాప్ పెట్టలేదు. హీరోయిన్ గానే సినిమాలు చేస్తోంది. ఇన్ని రోజులు పిల్లల్ని ప్లాన్ చేయలేదేమో అని అంతా అనుకున్నారు. కానీ కత్రినా పిల్లల కోసం ట్రై చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పిల్లల కోసం ఆమె ప్రత్యేక పూజలు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. తనకంటే చిన్నవాడైన విక్కీతో డేటింగ్ చేసింది. చాలా రోజులు వీరి రిలేషన్ ను బయట పెట్టలేదు. మ్యారేజ్ కూడా సీక్రెట్ గా చేసుకుని షాక్ ఇచ్చింది.

Read Also : Javed Akhtar : ముక్కు, మొహం తెలియని హీరోలు వాళ్లు.. సౌత్ స్టార్లపై రచయిత వ్యాఖ్యలు

ఇన్నేళ్ల తర్వాత పిల్లల కోసం ట్రై చేస్తోందంట ఈ బ్యూటీ. తాజాగా కర్నాటకలోని కుక్కె సుబ్రహ్మణ్య స్వామి ఆలసయంలో ఆమె ప్రత్యేక పూజలు చేసింది. ఈ ఆలయంలో పిల్లలు పుట్టడం కోసం ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. ఇప్పుడు కత్రినా కూడా పిల్లల కోసమే పూజలు చేసిందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. కానీ కత్రినా మాత్రం ఏమీ స్పందించట్లేదు. అటు విక్కీ కౌశల్ చావా సినిమాతో నేషనల్ స్టార్ అయిపోయాడు. బాలీవుడ్ పెద్ద హీరోల లిస్టులో చేరిపోయాడు. విక్కీ ఎదుగుతున్నాడు కాబట్టి తాను సినిమాలకు బ్రేక్ తీసుకుని పిల్లల్ని కనాలని కత్రినా అనుకుంటుందేమో అనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Read Also : Angoor Bhai: గంజాయి డాన్ అంగూరు భాయ్‌పై పీడీ యాక్ట్..