Site icon NTV Telugu

Warden Punishment: విద్యార్థులపాలిట యమదూతగా మారిన హాస్టల్ వార్డెన్..

Hostel Warden

Hostel Warden

Warden Punishment in UP: ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌ నగరంలోని హాస్టల్‌ లో నివసిస్తున్న విద్యార్థినులను దారుణంగా కొట్టిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కస్తూర్బా గాంధీ విద్యాలయ హాస్టల్‌ కు సంబంధించినది. రూల్స్ ప్రకారం ఆహారం అడగడమే బాలిక విద్యార్థుల తప్పుగా మారింది. అయితే., వార్డెన్ విద్యార్థులను కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో డిపార్ట్మెంట్ సీనియర్ అధికారి వెంటనే సంఘటనా స్థలానికి దర్యాప్తు బృందాన్ని పంపారు. పోలీసులు కూడా ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Bangladesh Crisis: బంగ్లాదేశ్లో అల్లర్ల ఎఫెక్ట్.. భారత్-బంగ్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ హై అలర్ట్..!

విద్యార్థినులను వార్డెన్ కర్రతో ఎలా కొడుతున్నాడో వైరల్ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. విద్యార్థినులు అరుస్తూ కేకలు వేస్తున్నా వార్డెన్ కనికరం చూపలేదు సరి.. వారిని నిరంతరం కొడుతూనే ఉంది. వార్డెన్ గది నుంచి బయటకు వెళ్లిన తర్వాత విద్యార్థినులు ఒక్కొక్కరుగా ఏడుస్తూ తమ గాయాలను వీడియోలో చూపిస్తున్నారు. ఆ వార్డెన్ పేరు అర్చన పాండే. నియమ చార్ట్‌ ప్రకారం ఆహారం ఇవ్వడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో వార్డెన్‌ కొట్టాడని దళిత విద్యార్థినులు చెబుతున్నారు. డైట్‌ చార్ట్‌ ప్రకారం.. వారికి హాస్టల్‌లో భోజనం పెట్టడం లేదని చెప్పారు. దీంతో కోపోద్రిక్తురాలైన వార్డెన్‌ ని కొట్టడం ప్రారంభించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గోరఖ్‌ పూర్ పోలీసుల మీడియా సెల్ వీడియోను గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించింది. అనంతరం పోలీసులు పాఠశాలకు చేరుకోవడంతో విద్యార్థినులను కలిసి వారి సమస్యలను విన్నవించారు.

Simba Movie: మొక్కలు నాటండి.. ఫ్రీగా సింబా సినిమా చూసేయండి!

ఈ సందర్భంగా ప్రాథమిక విద్యాధికారి రవీంద్ర సింగ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఈ సమాచారం అందిందని, వార్డెన్ విద్యార్థినులను కొట్టిన విషయం చాలా సీరియస్‌గా ఉందని, దీనిపై సమాచారం రాబట్టేందుకు బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. దాని నివేదికను బృందం సమర్పించింది. ప్రస్తుతం నివేదికను పరిశీలిస్తున్నామని, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Exit mobile version