Kasargold: ఓటీటీ లోకి వచ్చేసిన మాలయళం బ్లాక్ బస్టర్ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి రావడంతో థియేటర్స్ మూతపడి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ కరువైంది. దీనితో అప్పటి నుంచి ఓటీటీలు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీ ల హవా కొనసాగుతుంది.ఓటీటీ లలో ఎలాంటి భాషా బేధం లేకుండా సినిమాలు విడుదల అవుతున్నాయి. మంచి కంటెంట్ ఉంటే.. ప్రేక్షకులు కూడా వాటిని ఆదరిస్తున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓటీటీ సంస్థలు ఒక భాష చిత్రాలను ఇతర భాష లో కి అనుదిస్తున్నారు. వాటిలో యావరేజ్ టాక్ సినిమాలు మాత్రమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఉంటున్నాయి. ఇక మలయాళ చిత్రాల గురించి ప్రత్యేక్యంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పటికే మాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి 2018, జర్నీ ఆఫ్ 18 ప్లస్, పద్మినీ మరియు ఆర్డీఎక్స్ వంటి సినిమాలు ఓటీటీల్లో అదరగొట్టాయి.ఇప్పుడు మరో మలాయళ బ్లాక్ బస్టర్ చిత్రం ఓటీటీలో అదరగొట్టేందుకు వచ్చేసింది. ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమలో విడుదలైన కాసర్ గోల్డ్ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా సెప్టెంబర్ 15న థియేటర్లలో విడుదలై భారీగా విజయం సాధించింది.ఓ రాజకీయ నాయకుడు స్మగ్లింగ్ చేయిస్తున్న బంగారం పడిపోవడం.. ఆ బంగారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి అతని అనుచరులు ప్రయత్నంచడం వంటి కథాంశంతో ఆద్యంతం ఎంగేజింగ్‌గా అలాగే ఎంతో ఎంటర్టైనింగ్గా కాసర్ గోల్డ్ సినిమా సాగుతుంది.
మలయాళం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టిన కాసర్ గోల్డ్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.కాసర్ గోల్డ్ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో అక్టోబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం మరియు కన్నడ భాషల్లో కాసర్ గోల్డ్ మూవీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది. మృదుల్ నాయర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో జైలర్ ఫేమ్ వినాయకన్ ముఖ్య పాత్ర పోషించాడు. అలాగే దసరా విలన్ షైన్ టామ్ చాకో కూడా ముఖ్య పాత్ర చేశాడు. యూడ్లీ ఫిల్మ్స్ బ్యానర్‌పై విక్రమ్ మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ నిర్మించారు.కాసర్ గోల్డ్ సినిమాలో అసీఫ్ అలీ, సన్నివేలన్, సిద్ధిఖీ, సంపత్ రామ్ మరియు దీపక్ పారంబోల్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. విష్ణు విజయ్ ఈnసినిమాకు సంగీతం అందించారు. రాజకీయ నాయకుడు స్మగ్లింగ్ చేయాలనుకున్న బంగారం దొంగతనం కావడం.. ఫైజల్ గ్యాంగ్ వెంట అతని అనుచరులు పడటం వంటి ట్విస్టులతో కాసర్ గోల్డ్ సినిమా సాగుతుంది.. అలాగే యూత్ ని ఆకట్టుకునే ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్, లవ్ రొమాన్స్ అన్ని అంశాలతో కాసర్ గోల్డ్ సినిమా తెరకెక్కింది.ఈ వీకెండ్ ఓటీటీ ప్రేక్షకులకు కాసర్ గోల్డ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!