Karthika Masam 2023: నేటి నుండి కార్తీక మాసం ఆరంభం కావడంతో రాజమండ్రిలో స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి వేలాదిగా తరలివచ్చి గోదావరిలో భక్తులు కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల పుణ్య స్నానాలతో పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్ కిక్కిరిసాయి. స్నానాలు ఆచరించిన మహిళలు శివనామ స్మరణతో గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు.
Read Also: Dhruva Natchathiram : రికార్డు ధరకు సేల్ అయిన ధృవనక్షత్రం ఓటీటీ రైట్స్..?
కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు.. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.. మరోవైపు.. భీమవరం పంచారామ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా స్వామి దర్శనానికి బారులు తీరారు భక్తులు.. ఇక, సామర్లకోట పంచారామ క్షేత్రం కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా స్వామి దర్శనానికి క్యూ కట్టారు భక్తులు.. మరోవైపు.. ద్రాక్షరామ పంచారామ క్షేత్రం భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.. ఇక, కార్తిక మాసం ప్రారంభం సదర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో దర్శనం వేళలో మార్పులు చేశారు ఆలయ అధికారులు.. ఉదయం 4 గంటలకు ఆలయం తెరిచి 5 గంటలకు భక్తులకు దర్శనాలు ప్రారంభిస్తు్నారు.. రాత్రి 9 గంటలకు భక్తులకు దర్శనాలు నిలిపివేయనున్నారు..